ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Lavu Sri Krishna Devarayalu: పాక్‌ బెదిరింపులకు భయపడేదిలేదు

ABN, Publish Date - Jun 05 , 2025 | 06:40 PM

ఆపరేషన్ సిందూర్ పరిణామాలు, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరును ఖతార్, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఐటోపియాలోని ప్రతినిధులకు వివరించామని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. వారి నుంచి అపూర్వ స్పందన వచ్చిందని తెలిపారు. తాము కలిసిన ప్రతి దగ్గర భారతదేశం ఎందుకు ఆపరేషన్ సిందూర్ నిర్వహించిందనే విషయం గురించి తాము వివరించామని అన్నారు.

TDP MP Lavu Sri Krishna Devarayalu

ఢిల్లీ: ప్రధానమంత్రి నరంద్రమోదీ, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, కేంద్రమంత్రి కిరణ్ రిజుజు సూచనమేరకు 7 పార్లమెంట్ బృందాలతో కూడిన ఎంపీలందరం 35 దేశాల్లో పర్యటించామని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు (Lavu Sri Krishna Devarayalu) వ్యాఖ్యానించారు. రేపు(శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌తో భేటీ అవుతామని తెలిపారు. విదేశీ పర్యటన అంశాలను వివరిస్తామని చెప్పారు.


తాము నాలుగు దేశాలు వెళ్లామని లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఆపరేషన్ సిందూర్ పరిణామాలు, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరును ఖతార్, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఐటోపియాలోని ప్రతినిధులకు వివరించామని తెలిపారు. వారి నుంచి అపూర్వ స్పందన వచ్చిందని పేర్కొన్నారు. వివిధ దేశాల్లోని మాజీ ప్రధానమంత్రులు, డిప్యూటీ స్పీకర్లను కలిసి వివరించామని తెలిపారు. తాము కలిసిన ప్రతి దగ్గర భారతదేశం ఎందుకు ఆపరేషన్ సిందూర్ నిర్వహించిందనే విషయం గురించి వివరించామని అన్నారు. సామాన్యులకు ఎలాంటి నష్టం జరగకుండా ఉగ్రవాదుల స్థావరాలను ఎలా టార్గెట్ చేశామనేది వివరించామని తెలిపారు లావు శ్రీకృష్ణదేవరాయలు.


ఏ దేశానికి వెళ్లినా పాకిస్థాన్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న అంశాన్ని చెబుతున్నారని లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. భారతదేశం ఎప్పుడూ శాంతిని మాత్రమే కోరుకుందని వివరించారు. ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం చేశామని చెప్పుకొచ్చారు. పాకిస్థాన్ న్యూక్లియర్ పేరుతో బ్లాక్‌మెయిల్ చేసేలా ప్రయత్నం చేస్తే దానికి భయపడేదిలేదని తాము చెప్పామని అన్నారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా ఆయా దేశాలు ముందుకెళ్లాలని సూచించామని చెప్పారు. టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ తీరును ఎండగట్టామని లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.


పాకిస్థాన్‌కు ప్రపంచ దేశాల నుంచి ఆర్థిక సహాయం అందకుండా చూడాలని కోరాం, వారిచ్చే నిధుల ద్వారా పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని చెప్పుకొచ్చారు. విదేశాలకు వెళ్లే బృందాల్లో తప్పకుండా టీడీపీ తరపున వెళ్లాలని సూచించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. టెర్రరిజంపై భారత విధానం ఏంటో పలు దేశాల్లోని ప్రతినిధులకు వివరించామని లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములవ్వండి.. సీఎం చంద్రబాబు పిలుపు

జగనన్నా.. మాకు దిక్కెవరన్నా.. నెల్లూరులో ఫ్లెక్సీల కలకలం

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 05 , 2025 | 06:53 PM