ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN, Publish Date - May 18 , 2025 | 01:39 PM

KTR: హైదరాబాద్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని క్షతగాత్రులకు మెరుగైన ఉచిత చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఈ సంక్షోభ సమయంలో అవసరమైన ఏ సహాయానికైనా అందుబాటులో ఉంటాయని చెప్పారు.

KTR

హైదరాబాద్: పాతబస్తీలోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్నిప్రమాద ఘటనలో 17 మంది మృతిచెందారు. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) స్పందించారు. ఈ విషాద ఘటన వివరాలు తెలిసి అత్యంత షాక్‌కు, బాధకు గురయ్యానని తెలిపారు. ఈ విషాద ఘటన చాలా హృదయవిదారకంగా ఉందని చెప్పారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇవాళ(ఆదివారం) కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు.


రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని క్షతగాత్రులకు మెరుగైన ఉచిత చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. బీఆర్‌ఎస్ శ్రేణులు ఈ సంక్షోభ సమయంలో అవసరమైన ఏ సహాయానికైనా అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ ఘటనలో బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు బీఆర్‌ఎస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు అధికారులతో కలిసి పనిచేస్తారని అన్నారు. స్థానిక బీఆర్ఎస్ నేతలకు ప్రమాద స్థలం వద్ద సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కేటీఆర్ సూచించారు. ప్రభుత్వం ఈ అగ్నిప్రమాదానికి కారణాలను లోతుగా విచారించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఓల్డ్ సిటీతో పాటు హైదరాబాద్ నగరంలో అగ్ని భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని, అగ్నిమాపక శాఖ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. ఈ విషాద సమయంలో హైదరాబాద్ ప్రజలందరూ ఐక్యంగా నిలిచి, బాధితులకు అండగా ఉండాలని మాజీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.


అగ్నిమాపక శాఖతో సమీక్ష నిర్వహించాలి: హరీశ్‌రావు

గుల్జార్‌హౌస్‌ ప్రమాదంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో 17 మంది మరణం బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇవాళ(ఆదివారం) హరీశ్‌రావు ఓ ప్రకటన విడుదల చేశారు. వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నా ముందస్తు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. వేసవిలో అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు వ్యూహం లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ అలసత్వానికి సామాన్యులు చనిపోతున్నారని అన్నారు. అగ్నిమాపక శాఖ సన్నద్ధతపై ఇప్పటికైనా సమీక్ష నిర్వహించాలని కోరారు. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ప్రకటించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Telangana: చీఫ్ మినిస్టర్ ఓ ఎస్ డీ అంటూ వ్యాపారులకు వల..

High Court: లిఫ్ట్‌ ప్రమాదాలపై సుమోటో విచారణ

Naxalism: నక్సల్స్‌ మూలాలపై దెబ్బ..

Crocodile Attack: రైతును నీళ్లలోకి లాక్కెళ్లిన మొసలి

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 18 , 2025 | 01:44 PM