Share News

High Court: లిఫ్ట్‌ ప్రమాదాలపై సుమోటో విచారణ

ABN , Publish Date - May 18 , 2025 | 05:03 AM

అపార్ట్‌మెంట్‌ల్లో లిఫ్ట్‌లు సరిగా లేక ప్రాణాలు పోతున్న ఘటనలపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది.

High Court: లిఫ్ట్‌ ప్రమాదాలపై సుమోటో విచారణ

  • లేఖను వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): అపార్ట్‌మెంట్‌ల్లో లిఫ్ట్‌లు సరిగా లేక ప్రాణాలు పోతున్న ఘటనలపై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ ప్రమాదాలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. లిఫ్ట్‌ల భద్రతకు సంబంధించి నిబంధనలు అమలు కాకపోవడం వల్ల పలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన ఘటనలు ఉన్నాయంటూ అందిన లేఖను హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది.


ఈ పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, జస్టిస్‌ రేణుక ధర్మాసనం స్వీకరించింది. విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB

PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 18 , 2025 | 05:03 AM