Telangana: చీఫ్ మినిస్టర్ ఓ ఎస్ డీ అంటూ వ్యాపారులకు వల..
ABN , Publish Date - May 18 , 2025 | 09:25 AM
చీఫ్ మినిస్టర్ ఓ ఎస్ డీ అంటూ వ్యాపారులకు వల వేస్తున్న సైబర్ నేరగాళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీ ఎన్ ఎస్ 319(2)తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు.
హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో పలు వ్యాపార సంస్థల యజమానులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మెయిల్స్, వాట్స్ అప్ మెసేజెస్ పెడుతూ వారిని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి ఫిర్యాదుతో వారిపై కేసు నమోదు అయింది.
చీఫ్ మినిస్టర్ ఓ ఎస్ డీ అంటూ వ్యాపారులకు వల వేస్తున్న సైబర్ నేరగాళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులు బీ ఎన్ ఎస్ 319(2)తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు. రాపిడో, గుప్తా రియల్టీ, బెకెం రియల్టీ, కంట్రీ డిలైట్ తదితర సంస్థల యజమానులు సైబర్ మెయిల్స్ అందుకున్నట్లు తెలుస్తుంది.
కాగా, ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు మరింత పెరిగిపోతున్నాయి. రకరాల మార్గాల ద్వారా కేటుగాళ్లు డబ్బులు కాజేస్తున్నారు. ఈ నేరాలను అరికట్టేందుకు చట్టంలో వివిధ రకాల సెక్షన్లు ఉన్నా సైబర్ నేరగాళ్లు మాత్రం భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఏకంగా చీఫ్ మినిస్టర్ ఓ ఎస్ డీ అంటూ వ్యాపారులకు బురిడికొట్టాడానికి ప్రయత్నించారు.
Also Read:
Health Tips: భోజనం తర్వాత నిద్రమత్తుగా ఉంటుందా..
Egg Diet Tips: రోజూ ఎన్ని గుడ్లు తినాలి.. అతిగా తినడం వల్ల ఈ సమస్యలు వస్తాయా..
Hyderabad: వంటగది కిటికీలోనుంచి చొరబడి..