Share News

Hyderabad: వంటగది కిటికీలోనుంచి చొరబడి..

ABN , Publish Date - May 18 , 2025 | 10:00 AM

వంటగది కిటికీలోనుంచి చొరబడి.. 75 తులాల బంగారం నగలను చోరీ చేసిన సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. మలక్‌పేట రైల్వేస్టేషన్‌ను ఆనుకుని ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో గల మొదటి అంతస్తులో ఈ చోరీ జరిగింది.

Hyderabad: వంటగది కిటికీలోనుంచి చొరబడి..

- ఇంట్లో చోరీ

- 75తులాల బంగారు నగలు, రూ.2.50లక్షల నగదు అపహరణ

హైదరాబాద్: చాదర్‌ఘాట్‌ పోలీస్‏స్టేషన్‌(Chaderghat Police Station) పరిధిలోని ఆజంపురలో గల మలక్‌పేట రైల్వేస్టేషన్‌ను ఆనుకుని ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో గల మొదటి అంతస్తులో శనివారం అర్ధరాత్రి భారీ చోరీ జరి గింది. చాదర్‌ఘాట్‌ పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆజంపురలోని అద్దె ఇంట్లో మొదటి అంతస్తులో నివాసముంటున్న మహ్మద్‌ ఫహీముద్దీన్‌ ఏఎస్‏రావు నగరంలోని జేయింట్‌ హోటల్‌లో మెయిన్‌టెనెన్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఎస్సీ ఎంపీని ఆహ్వానించకపోవడం దుర్మార్గం..


ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నా రు. ఫహీముద్దీన్‌ అతని కుమార్తె కలిసి ఇంట్లో వేర్వేరు గదుల్లో నిద్రించారు. గుర్తు తెలియని వ్యక్తులు వీరి ఇంటి వెనుక వైపు ఉన్న మలక్‌పేట రైల్వేస్టేషన్‌ నుంచి వంట గది కిటికీలో నుంచి చొరబడ్డారు. మొదట్లో చేతికందిన వంట సామగ్రిని చోరీ చేసేందుకు ఒక్కొక్కటిగా కిటికీలో నుంచి రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ ఫారం వైపు పారవేశారు. అనంతరం బెడ్‌రూంలో నిద్రిస్తున్న ఫహీముద్దీన్‌ గదిని బయటి నుంచి బిగించారు.


city4.jpg

అతని పక్కనే పెట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ను చోరీ చేశారు. అనంతరం మరో బెడ్‌రూంలో ఉన్న బీరువా పక్కనే ఉన్న తాళాలతో బీరువా తెరచి బంగారు నగలు, నగదును చోరీ చేశారు. బాధితులు డయల్‌ 100కు సమాచారం ఇచ్చారు. చాదర్‌ఘాట్‌ ఎస్‌ఐ భరత్‌ తన సిబ్బందితో వచ్చి పరిశీలించారు. రూ. 2.50లక్షల నగదు, 75తులాల బంగారు నగలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


రంగంలోకి క్లూస్‌ టీమ్‌..

చోరీ జరిగిన విషయం తెలియగానే చాదర్‌ఘాట్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌ భూపాల్‌గౌడ్‌ తన సిబ్బందితో క్లూస్‌ టీమ్‌ను, డాగ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. చోరీ జరిగిన వివరాలు సేకరిస్తున్నారు. వేలి ముద్రలను సేకరించారు.


8 బృందాలతో గాలింపు చర్యలు

భారీ చోరీకి పాల్పడిన దొంగలను గుర్తించేందుకు సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ కాంతిలాల్‌ పాటిల్‌ ఆదేశాల మేరకు 8 బృందాలను రంగంలోకి దింపినట్లు మలక్‌పేట ఏసీపీ శ్యాంసుందర్‌ తెలిపారు. చాదర్‌ఘాట్‌ పోలీసులతోపాటు మలక్‌పేట డివిజన్‌ నుంచి ఆరు టీమ్‌లను, సౌత్‌ఈస్ట్‌ జో న్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, సీసీఎస్‌ పోలీసులతో కలిపి 8 బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి.

Crocodile Attack: రైతును నీళ్లలోకి లాక్కెళ్లిన మొసలి

Rajanna Sircilla: సిరిసిల్లలో మరో నేతన్న ఆత్మహత్య

తొమ్మిది నెలల క్రితమే వివాహం.. విషాదంలో శ్రీధర్ కుటుంబం

MP Arvind:కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు

Read Latest Telangana News and National News

Updated Date - May 18 , 2025 | 10:02 AM