ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Narayana: ఆ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది

ABN, Publish Date - May 15 , 2025 | 12:25 PM

Minister Narayana: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఏపీకి చాలా నష్టం చేశారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్థంగా పనులు చేశారని మంత్రి నారాయణ విమర్శించారు.

Minister Narayana

నెల్లూరు: జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో ఏపీకి తీరని నష్టం చేసిందని మంత్రి నారాయణ (Minister Narayana) ఆరోపించారు. అమృత స్కీమ్ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శలు చేశారు. ఇవాళ(గురువారం) నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 339 అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పోటీ పడి శ్రీధర్ రెడ్డి అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. పొట్టేపాలెం వద్ద వంతెనకు త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్థంగా పనులు చేశారని విమర్శించారు. స్వపరిపాలన విధానాన్ని వైసీపీ ప్రభుత్వం వదిలేసిందని మండిపడ్డారు. నగరంలో ఆగిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజి, శుద్ధి నీటి ప్లాంట్‌ పెండింగ్ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


ఎంఎస్ఎంఈ పార్క్‌ను అభివృద్ధి చేయాలి: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సోదరుడు గిరిధర్ రెడ్డి 339 పనులను ఒకే రోజు ప్రారంభించారని.. ఈ ఘనత వారికే చెందుతుందని.. ఇది ఒక చరిత్ర అని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. ఇదే విధంగా ఎంఎస్‌ఎంఈ పార్కుని కూడా నెల్లూరు రూరల్‌లో అభివృద్ధి చేయాలని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు.


ఆ పనులను సైనికులకు అంకితం చేస్తున్నాం: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

భారతదేశ సైనికులకు 339 అభివృద్ధి పనులను అంకితం చేస్తున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. దేశ గౌరవాన్ని కాపాడిన సిందూర్ ఆపరేషన్‌ని విజయవంతం చేసిన సైనికులను మనం ఎల్లప్పుడు గుర్తు పెట్టుకోవాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు.


శ్రీధర్ రెడ్డివి వినూత్న ఆలోచనలు: ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డివి వినూత్న ఆలోచనలని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల కోసం పోరాటం చేయాలన్నా ఒక్క శ్రీధర్ రెడ్డికి మాత్రమే సాధ్యమని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి, ఆయా పనులు చేసి, ప్రజల మన్ననలను శ్రీధర్ రెడ్డి పొందారని ప్రశంసించారు. సీఎం చంద్రబాబు కూడా శ్రీధర్ రెడ్డిని అభినందించారని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గుర్తుచేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Minister Lokesh: అనంతపురంలో మంత్రి నారా లోకేష్ పర్యటన

AP News: జగన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం ఝలక్.. ఎందుకంటే..

AP News: సామర్లకోట మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం

సామర్లకోట మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం

బెజవాడ కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీర బహుకరణ

For More AP News and Telugu News

Updated Date - May 15 , 2025 | 12:31 PM