Share News

AP News: సామర్లకోట మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం

ABN , Publish Date - May 15 , 2025 | 08:29 AM

AP News: వైసీపీ నేతలతో సామర్లకోట మున్సిపల్ చైర్‌పర్సన్‌ అరుణకు ఇటీవల కాలంలో సఖ్యత చెడింది. 31 మంది కౌన్సిలర్లకు గాను సొంత పార్టీ నుంచి 26 మంది సంతకాలు చేసి అవిశ్వాసం కోరుతూ నిర్ణయం తీసుకున్నారు.

AP News: సామర్లకోట మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం
AP News

కాకినాడ జిల్లా: సామర్లకోట (Samarlakota) మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ (Municipal Chairperson ) అరుణ (Aruna)పై గురువారం కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారు. వైసీపీ నుంచి ఎన్నికైన చైర్‌పర్సన్‌ను తొలగించేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అవిశ్వాసం కోరుతూ 26 మంది కౌన్సిలర్లు సంతకాలతో కూడిన లేఖ కలెక్టరుకు అందజేశారు.దీంతో ఈ రోజు అవిశ్వాస తీర్మానం జరగనుంది. అవిశ్వాస సమావేశానికి ప్రత్యేకాధికారిగా కాకినాడ ఆర్డీవో మల్లిబాబును కలెక్టర్ నియమించారు.


వైసీపీ నేతలతో చైర్‌పర్సన్‌ అరుణకు ఇటీవల కాలంలో సఖ్యత చెడింది. 31 మంది కౌన్సిలర్లకు గాను సొంత పార్టీ నుంచి 26 మంది సంతకాలు చేసి అవిశ్వాసం కోసం నిర్ణయం తీసుకున్నారు. కాగా పెద్దాపురం నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ దవులూరి తనపై కక్ష పూరితంగా వ్యవహ రిస్తున్నారని ఇటీవల చైర్‌పర్సన్ అరుణ ఆరోపించారు. వైసీపీ ఇంచార్జ్ దవులూరి కౌన్సిలర్లను ఇంట్లో కూర్చో బెట్టుకుని.. అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రోటోకాల్ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటే టీడీపీ ముద్ర వేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: బెజవాడ కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీర బహుకరణ


కాగా బుధవారం జరగాల్సిన సామర్లకోట మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం వాయిదా పడింది. కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చైర్‌పర్సన్‌ అరుణ ప్రకటించారు. సమావేశానికి సభ్యులు పూర్తి స్థాయిలో హాజరుకాలేదు. టీడీపీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లతో పాటు వైసీపీకి చెందిన ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. దీంతో కోరం సరిపోలేదని అరుణ పేర్కొంటూ ఈ మేరకు వాయిదా వేశారు.

కౌన్సిల్‌లో 31 మంది సభ్యులుండగా వైసీపీ నుంచి 29 మంది గెలిచారు. వైసీపీకి చెందిన ఒక కౌన్సిలర్‌ మృతి చెందగా ఎన్నికల ముందు ఇద్దరు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ బలం నాలుగుకు చేరింది. ప్రస్తుత సమావేశం నిర్వహణకు 16 మంది సభ్యులుండాలి.. అయితే ఐదుగురు సభ్యులే హాజరుకావడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ అరుణ ప్రకటించారు. ప్రభుత్వం నుంచి పట్టణాభివృద్ధికి రూ. 3 కోట్లు మంజూరయ్యాయని, కౌన్సిల్‌లో చర్చించి ఆమోదించాల్సి ఉండగా సభ్యుల హాజరుకాలేదని చైర్‌ పర్సన్‌ అరుణ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని సమాధానం చెప్పాలి

శ్రీనివాస గోవిందా పాట తొలగించకుంటే

అందాల పోటీల కోసం పేదల ఇళ్లు కూలుస్తారా?

For More AP News and Telugu News

Updated Date - May 15 , 2025 | 08:29 AM