ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని సమాధానం చెప్పాలి
ABN , Publish Date - May 15 , 2025 | 05:58 AM
భారత్, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తానే కుదిర్చానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు
కాంగ్రెస్ డిమాండ్..దేశ వ్యాప్తంగా ర్యాలీలకు ప్రణాళిక
న్యూఢిల్లీ, మే 14 : భారత్, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తానే కుదిర్చానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు...? అలాగే ఆపరేషన్ సిందూర్ ఎందుకు నిలిపివేశారో జవాబు చెప్పాలని కోరుతూ దేశ వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. బుధవారం ఇక్కడ ఆ పార్టీ సీనియర్ నేతల సమావేశం జరిగింది.
అనంతరం నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్, మీడియా, ప్రచార హెడ్ పవన్ ఖేరా మాట్లాడుతూ ఈమేరకు తెలిపారు. సైనిక చర్య సైనిక దళాలు, దేశం సాధించిన విజయమైతే.. బీజేపీ తన సొంతం చేసుకోవాలని చూస్తోందని పవన్ ఖేరా ఆరోపించారు. తమ ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరుతూ పలు రాష్ట్రాల్లో జైహింద్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.