KTR: అందాల పోటీల కోసం పేదల ఇళ్లు కూలుస్తారా?
ABN , Publish Date - May 15 , 2025 | 04:18 AM
అందాల పోటీల కోసం పేదల ఇళ్లు కూలుస్తారా? ఇదేనా ప్రజాపాలన అంటూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

ఈ చర్యలపై రాహుల్ సమాధానం చెప్పాలి: కేటీఆర్
హైదరాబాద్, మే 14(ఆంధ్రజ్యోతి): అందాల పోటీల కోసం పేదల ఇళ్లు కూలుస్తారా? ఇదేనా ప్రజాపాలన అంటూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అందాల పోటీలో పాల్గొనేవారి పర్యటన కోసం వరంగల్‌లో దారివెంట ఇళ్ల ధ్వంసం అప్రజాస్వామికమన్నారు. కాంగ్రెస్ అరాచక పాలనా విధానంపై, అమానవీయ చర్యలపై రాహుల్ గాంధీ స్పందించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పేదప్రజల జీవితాలు రాక్షస బుల్డోజర్లకింద నలిగిపోవాలా అని ప్రశ్నించారు. పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాగా, ప్రపంచసుందరి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చినవారి కాళ్లను తెలంగాణ మహిళలతో కడిగించడం అభ్యంతరకరమని.. ఇది మొత్తం తెలంగాణ సమాజాన్ని అవమానించినట్లేనని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News