Share News

Minister Lokesh: అనంతపురంలో మంత్రి నారా లోకేష్ పర్యటన

ABN , Publish Date - May 15 , 2025 | 09:48 AM

Minister Nara Lokesh: మంత్రి నారా లోకేష్ గురువారం నుంచి అనంతపురం జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

Minister Lokesh: అనంతపురంలో మంత్రి నారా లోకేష్ పర్యటన
Minister Nara Lokesh

అనంతపురం జిల్లా: ఏపీ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ( Minister Nara Lokesh) గురువారం నుంచి అనంతపురం జిల్లా (Anantapuram Dist)లో మూడు రోజులపాటు పర్యటించనున్నారు (Visit). ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. 16వ తేదీ (శుక్రవారం) ఉదయం 10 గంటలకు రూ. 22 వేల కోట్లతో చేపట్టనున్న రీన్యూ ప్రాజెక్టుకు శంకుస్థాపన (Renew project launch) చేస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కుమార్తె వివాహానికి హాజరవుతారు. శుక్రవారం రాత్రి అనంతపురంలోనే మంత్రి లోకేష్ బస చేస్తారు. 17వ తేదీ (శనివారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జేఎన్టీయూ స్నాతకోత్సవంలో మంత్రి పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి వస్తారు.


రీన్యూ ప్రాజెక్టుకు శంకుస్థాపన...

కాగా రూ. 22 వేల కోట్లతో అనంతపురం జిల్లాలో రీన్యూ ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణం కానుంది. దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు 16న (శుక్రవారం) మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేస్తారు. గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణం జరగనుంది. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి లోకేష్, రీన్యూ చైర్మన్ సుమంత్ సిన్హా మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రీన్యూ పవర్ ముందుకు వచ్చింది.

Also Read: జగన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం జలక్.. ఎందుకంటే..


ఈ ప్రాజెక్టు తొలిదశలో రీన్యూ సంస్థ 587 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల సామర్థ్యంగల బ్యాటరీ స్టోరేజి యూనిట్లపై రూ.7 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వివిధ దశల్లో 1800 మెగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్, 2వేల మెగావాట్ల సామర్థ్యంగల బ్యాటరీ స్టోరేజి యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. 2019కి ముందు 777 మెగావాట్ల సామర్థ్యంతో ఏపీ పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రధాన పెట్టుబడిదారుగా రీన్యూ పవర్ ఉంది. వచ్చే ఐదేళ్లలో 72 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకురావడం లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ పెట్టుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సామర్లకోట మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం

బెజవాడ కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీర బహుకరణ

For More AP News and Telugu News

Updated Date - May 15 , 2025 | 09:48 AM