Raghunandan Rao: కవితకు సామాజిక తెలంగాణ ఇప్పుడు గుర్తుకొచ్చిందా.. రఘునందన్ రావు ప్రశ్నల వర్షం
ABN, Publish Date - May 31 , 2025 | 09:03 PM
కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మేధావులు మర్చిపోయినటువంటి చరిత్రను బీజేపీ పార్టీ పరిచయం చేస్తుందని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు తమపై దండయాత్ర చేస్తే ఊరుకునేది లేదని రఘునందన్ రావు హెచ్చరించారు.
సిద్దిపేట జిల్లా: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొలి విడతలో ఒక్క మహిళకు కూడా మంత్రి వదవీ ఇవ్వలేదని.. ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) తన తండ్రి కేసీఆర్‌ను ఎందుకు ప్రశ్నించలేని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) నిలదీశారు. ఇవాళ(శనివారం) గజ్వేల్ పట్టణంలో అహల్యాబాయి హెూల్కర్ విగ్రహాన్ని రఘునందన్ రావు ఆవిష్కరించారు. అనంతరం గజ్వేల్ పట్టణంలోని వివేకానంద విగ్రహం నుంచి చంద్రపూర్ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. మూడువందల సంవత్సరాల క్రితం స్త్రీల హక్కుల కోసం పోరాడిన అహల్యాబాయి హెూల్కర్ విగ్రహాన్ని గజ్వేల్‌లో ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఆ రోజుల్లోనే కులాంతర వివాహం కోసం ఆమె పోరాడారని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన తప్పిదాల గురించి మాట్లాడని కవిత.. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కవిత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై పోరాడతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కవితకు సామాజిక తెలంగాణ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు ఎంపీ రఘునందన్ రావు.
బీసీలకు సగం మంత్రి పదవులు ఇవ్వలేదు..
‘జనాభా దావాస ప్రకారం మంత్రి పదవులు ఇస్తామని చెప్పారు. మీరు చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలో 50శాతానికి పైగా బీసీలు ఉన్నారు. ఏ రోజు కూడా బీసీలకు సగం మంత్రి పదవులు ఇవ్వమని కల్వకుంట్ల కవిత కేసీఆర్‌ను అడగలేదు. బీజేపీ స్పృశించినటువంటి అంశం లేదు. ఎవరూ అడగకుండా రైతులకు మేలు చేసే నిర్ణయాలను బీజేపీ ప్రభుత్వం తీసుకుంది. కేబినెట్ నిర్ణయం తీసుకొని లక్షల కోట్ల రూపాయలు రైతన్నకి బీజేపీ ప్రభుత్వం అందిస్తోంది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన కొద్ది నెలలకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైంది. మోదీ ప్రభుత్వంలో 27 మంది ఓబీసీ శాఖలకు బీసీ మంత్రులు ఉన్నారు’ అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు.
బీజేపీని విమర్శిస్తే ఊరుకోం...
‘కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మేధావులు మర్చిపోయినటువంటి చరిత్రను బీజేపీ పరిచయం చేస్తుంది. బీజేపీని విమర్శిస్తే ఊరుకునేది లేదు. వందమంది మోదీలు వచ్చిన ఆర్టికల్ 370 రద్దు కాదని కాంగ్రెస్ నేతలు అన్నారు. ఒక్క మోదీ తలుచుకుంటేనే ఆర్టికల్ 370 రద్దు చేశారు. సామాజిక న్యాయం గురించి బీసీ మద్దతు గురించి 12 మంది కేబినెట్‌లో మద్దతిచ్చారు. భారతీయ ప్రజలకు ఏది లాభం జరుగుతుందో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమలు చేస్తున్నారు. పదవి లేకపోతే వేరే కుంపటి పెట్టే వాళ్లు మా పార్టీలో ఎవరూ లేరు. మీ వారసత్వ పంచాయతీ కోసం మేం పట్టించుకోం. మోదీ గురించి ఎవరైనా మాట్లాడితే ఊరుకునేది లేదు’ అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వార్నింగ్ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: సామాన్యులకు షాకింగ్.. పెరిగిన గోల్డ్, తగ్గిన వెండి ధరలు
NIA raids: వరంగల్‌లో ఉగ్ర కలకలం!
Read Latest Telangana News and National News
Updated Date - May 31 , 2025 | 09:15 PM