MP Etala Rajender: కవిత ఎపిసోడ్‌పై ఎంపీ ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - May 29 , 2025 | 07:55 PM
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ఎంపీ ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ స్టేట్ ఫైట్ తప్పా.. స్ట్రీట్ ఫైట్ చేయదని స్పష్టం చేశారు. నీచ రాజకీయాల తాము చేయబోమని తేల్చిచెప్పారు ఈటల రాజేందర్.
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది. బీజేపీతో బీఆర్ఎస్ కలవబోతుందని కవిత లేఖ ద్వారా తెలిపారు. ఈ పరిణామాలను రెండు పార్టీల్లోని నేతలు ఖండిస్తున్నారు. తాజాగా మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Etala Rajender) ఈ వ్యాఖ్యలపై స్పందించారు. కవిత తెలంగాణ వాదులను కలవడం నేరం కాదు.. నాయకులు, కుటుంబీకుల ఫోన్లు ట్యాప్ చేయడం మాత్రం నేరమని అన్నారు. ఇవన్నీ నేర్పించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు ఎంపీ ఈటల రాజేందర్.
ఇవాళ(గురువారం) హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఈటల రాజేందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ స్టేట్ ఫైట్ తప్పా.. స్ట్రీట్ ఫైట్ చేయదని స్పష్టం చేశారు. నీచ రాజకీయాల తాము చేయబోమని తేల్చిచెప్పారు. పదేళ్లలో కేసీఆర్‌ని నమ్మి ప్రజలు మోసపోయారని.. ఆ తర్వాత కాంగ్రెస్‌ని నమ్మి ప్రజలు మరోసారి మోసపోయారని చెప్పారు. నేతల మధ్య కంచెలు నాటింది కేసీఆర్.. దాన్ని రేవంత్‌రెడ్డి కొనసాగిస్తున్నారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఎదురుపడితే నమస్కారం పెడతా.. అది తన సంస్కారమని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు ఒక ఎంపీగా, మాజీ ఆర్థిక మంత్రిగా హాజరవుతానని ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
రెండు లేదా మూడువర్గాలుగా గులాబీ పార్టీ: మహేశ్వర్‌రెడ్డి
బీఆర్‌ఎస్ పార్టీ చీలిక దిశగా వెళ్తుందని.. రెండు లేదా మూడు వర్గాలుగా గులాబీ పార్టీ చీలే అవకాశం ఉందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇది మాజీ సీఎం కేసీఆర్‌కు ఉహించని షాక్ అని చెప్పారు. రేపు, లేదా ఎల్లుండి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత మరో లేఖ రాయబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
ఇది పక్కా సమాచారమని అన్నారు. ఇవాళ(గురువారం) ఏబీఎన్‌తో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఇది వరకు కవిత బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా అడిగారని.. ఇందుకు కేసీఆర్ ఒప్పుకోలేదని... చివరగా మళ్లీ లేఖ రాసి సొంత కుంపటి పెడుతోందని అన్నారు. కవిత లేఖ బయటకు రావడం కంటే పది రోజుల ముందే తాను చెప్పానని గుర్తుచేశారు. ఇప్పుడు అదే జరిగిందని అన్నారు. కవిత తర్వాత మాజీ మంత్రి హరీష్‌రావు బయటకు రాబోతున్నారని ఆరోపించారు. బీజేపీతో బీఆర్ఎస్ కలవడమనేది కవిత అమాయకత్వానికి ప్రతీక అని మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కేసీఆర్ కుటుంబం మరో కొత్త సినిమా.. యెన్నం సెటైరికల్ కామెంట్స్
గద్దర్ అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 29 , 2025 | 08:03 PM