Share News

Yennam Srinivas Reddy: కేసీఆర్ కుటుంబం మరో కొత్త సినిమా.. యెన్నం సెటైరికల్ కామెంట్స్

ABN , Publish Date - May 29 , 2025 | 12:18 PM

Yennam Srinivas Reddy: భారత దేశం కర్మ భూమి అని.. ఇక్కడి పాపలకు ఇక్కడే శిక్ష అనుభవించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సొంత కుటుంబాన్ని మేనేజ్ చేసుకోలేని వ్యక్తి తెలంగాణను మళ్ళీ ఎలా పాలిస్తారని ప్రశ్నించారు.

Yennam Srinivas Reddy: కేసీఆర్ కుటుంబం మరో కొత్త సినిమా.. యెన్నం సెటైరికల్ కామెంట్స్
MLA Yennam Srinivas Reddy

హైదరాబాద్, మే 29: బీఆర్‌ఎస్‌లో కవిత (MLC Kavitha) ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. కవిత తన తండ్రి కేసీఆర్‌కు లేఖ రాయడం, లేఖలోని అంశాలు, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. అలాగే కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులపై అధికారపక్ష నేతలు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇందంతా డ్రామా అటూ కొట్టిపారేస్తున్నారు. తాజాగా మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) స్పందిస్తూ.. కల్వకుంట్ల ఫ్యామిలీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత కుటుంబ సభ్యులు ఒకరి గొంతు ఒకరు కోసుకుంటున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చేందుకే ఇలాంటి కుతంత్రాలకు తెరతీశారంటూ మండిపడ్డారు.


భారత దేశం కర్మ భూమి అని.. ఇక్కడి పాపలకు ఇక్కడే శిక్ష అనుభవించాలన్నారు. ఉద్యమకారుల గొంతులను కొడుకు, బిడ్డలు కోశారని.. అందులో కవిత పాత్ర కూడా ఉందని ఆరోపించారు. ఎంతో మంది రాజకీయ జీవితాలతో ఆడుకున్న కుటుంబం వాళ్ళది అంటూ కల్వకుంట కుటుంబంపై విమర్శలు గుప్పించారు. సొంత కుటుంబాన్ని మేనేజ్ చేసుకోలేని వ్యక్తి తెలంగాణను మళ్ళీ ఎలా పాలిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ చేతుల్లో రాష్ట్రం ఉంటే తెలంగాణ నాశనం అవుతుందని అప్పుడే చెప్పానన్నారు. పనికి రాని ప్రాజెక్టులు కట్టి.. అప్పులు ప్రజలకు రుద్దారని ఫైర్ అయ్యారు. అధికారం లేకపోతే ఒక్క నిముషం కూడా ఉండలేని కుటుంబం అని.. సొంత కుటుంబం సభ్యులు ఒకరి గొంతు ఒకరు కోసుకుంటున్నారని అన్నారు.


అధికారంలోకి రావడానికే కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. కేకే, మహేందర్ రెడ్డిని గెంటేసింది తమరు కాదా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ పెట్టడానికి, అధికారంలోకి రావడానికి కృషి చేసిన వేల మంది గొంతులు తడిగుడ్డతో కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు కల్వకుంట్ల కుటుంబం కొత్త సినిమా చూపిస్తోందంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. పాలనకు కేటీఆర్ అనర్హుడని కవిత చెబుతోందన్నారు. కేసీఆర్ అధికారం కోసం మాత్రమే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అధికార దాహం కోసం చూస్తున్నారన్నారు. కేసీఆర్‌ను మరోసారి అధికారంలో కూర్చోబెట్టడానికి ప్రజలు సిద్ధంగా లేరని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.


కవిత లేఖతో స్పష్టం: ఆది శ్రీనివాస్

adi-srinivas-whip.jpg

కరీంనగర్: డాడీ డాటర్ లేఖపై ప్రజల్లో చర్చ జరుగుతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కవిత లేఖతో కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారని ప్రజలు గ్రహించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పని తీరును ప్రజలు మెచ్చుకుంటున్నారని తెలిపారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్‌పై చేసిన ఆరోపణలు నిజమే అని కవిత లేఖతో స్పష్టమైందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

ఏనుగుల బీభత్సం.. ఫారెస్ట్ అధికారులపై అటాక్

గద్దర్ అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 29 , 2025 | 12:23 PM