ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MLA Danam Nagender: కిషన్‌రెడ్డికి బీసీల గురించి ఏం తెలుసు.. దానం నాగేందర్ ప్రశ్నల వర్షం

ABN, Publish Date - May 02 , 2025 | 01:46 PM

MLA Danam Nagender: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణని రోల్ మోడల్‌గా తీసుకొమ్మన్నారని దానం నాగేందర్ చెప్పారు.

MLA Danam Nagender

హైదరాబాద్:కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బీసీల గురించి ఏమి తెలుసని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నించారు. ఇవాళ(శుక్రవారం) హైదరాబాద్‌లో మీడియాతో దానం నాగేందర్ మాట్లాడారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కిషన్‌రెడ్డికి లేదని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులగణన ఎక్కడ చేయలేదని చెప్పారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణని రోల్ మోడల్‌గా తీసుకొమ్మన్నారని చెప్పారు. బీసీలం అల్ప సంతోషులమని అన్నారు. విమర్శలు ప్రతి విమర్శలు వల్ల సాధించేది ఏమీ లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.


దేశానికి రోల్ మోడల్‌గా తెలంగాణ: బీర్ల ఐలయ్య

దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో కులగణన చేసి రోల్ మోడల్‌గా నిలిచామని తెలంగాణ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఇవాళ(శుక్రవారం) సీఎల్పీ మీడియా పాయింట్‌లో బీర్ల ఐలయ్య మాట్లాడారు. సాహోసోపేత నిర్ణయాలతో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. జనగణనలో కులగణన చేస్తామన్న మోదీ కేబినెట్‌కి ధన్యవాదాలు తెలిపారు. దేశం అంత బీసీలకి న్యాయం జరగాలని అన్నారు. ఇక్కడ ఉన్న బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని అన్నారు. గతంలో రాహుల్ గాంధీ పాదయాత్రలో ప్రజల సమస్యలు చూసి కులగణన జరగాలని పోరాడారని చెప్పారు. తెలంగాణలో కులగణన రాహుల్ గాంధీ విజన్ అని చెప్పారు. కేంద్రమంత్రి అయ్యి ఉండి కిషన్‌రెడ్డి ఆలోచించి మాట్లాడాలని అన్నారు. ఏ లెక్కల ప్రకారం తమ కులగణన తప్పని కిషన్ రెడ్డి అంటున్నారని నిలదీశారు. రేపు కేంద్రం కులగణన చేసిన తర్వాత ఆ లెక్కలు చూసి చెప్పాలని సవాల్ విసిరారు. తెలంగాణని కేంద్రం రోల్ మోడల్‌గా తీసుకున్నందుకు రాష్ట్ర బీజేపీ నేతలకి దిమ్మ తిరిగిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి భారత్‌లో హీరోగా నిలబడటం కేంద్ర మంత్రులు జీర్ణించుకోలేక పోతున్నారని బీర్ల ఐలయ్య అన్నారు.


కవిత మాటలను స్వాగతిస్తాం..

కార్మిక దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్న నిజాలు మాట్లాడారని తెలంగాణ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని గత పదేళ్లలో అభివృద్ధి చేయలేదని అన్న కవిత మాటలను స్వాగతిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు కవితకి తలసరి ఆదాయం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో కొండలు, గుట్టలు, వెంచర్లకు రైతు రైతుబంధు ఇచ్చారని గుర్తుచేశారు. కేసీఆర్ కులగణనలో పాల్గొనలేదని.. అప్పుడు కవితకి సామాజిక న్యాయం ఎందుకు గుర్తుకు రాలేదని నిలదీశారు. కేసీఆర్ హయాంలో ఆర్టీసీ కార్మికులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేసినప్పుడు కవిత ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నపుడు కవితకి ఏం గుర్తుకురాదని విమర్శించారు. అధికారం పోయాక సామాజిక న్యాయమని కవిత అంటున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ పేదల నాయకుడని అభివర్ణించారు. ఇచ్చిన హామీలని ఒక్కొక్కటి అమలు చేస్తూ బీఆర్ఎస్ కంటే రేవంత్ ప్రభుత్వంలో మంచి పాలన అందిస్తున్నామని చెప్పారు. వరి ఏస్తే ఊరే అని చెప్పి కేసీఆర్ ఫాంహౌస్‌లో వరి పండిచినప్పుడు కవితకి రైతులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ సంక్షేమ పథకాలు వచ్చేవని అన్నారు. గత పదేళ్లు ప్రశ్నించని కవిత తన పార్టీలో ప్రాధాన్యత తగ్గగానే ప్రశ్నించటం ప్రారంభించిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Rates Today: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్..ఎంతకు చేరాయంటే..

Financial Aid: పుస్తకాల ముద్రణకు తెలుగు వర్సిటీ ఆర్థిక సహాయం

డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం

Gold Smuggling: శంషాబాద్‌ విమానాశ్రయంలో 3.5 కిలోల బంగారం పట్టివేత

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 06 , 2025 | 07:28 AM