Gold Smuggling: శంషాబాద్ విమానాశ్రయంలో 3.5 కిలోల బంగారం పట్టివేత
ABN , Publish Date - May 02 , 2025 | 05:50 AM
శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు 3.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయిలో నుంచి వచ్చిన ప్రయాణికుడు అక్రమ రవాణా చేస్తూ ఈ బంగారాన్ని తీసుకువచ్చాడు.

హైదరాబాద్, శంషాబాద్ రూరల్, మే 1 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు గురువారం రూ.3.45 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారు బిస్కట్లు స్వాధీనం చేసుకున్నారు. మస్క ట్ ద్వారా దుబాయి నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడు లో దుస్తుల్లో పెట్టుకుని వచ్చిన బంగారం అక్రమ రవాణాకు యత్నించాడు. విమానం దిగగానే విమానాశ్రయంలోని గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బందిలో ఒకరికి బంగారు బిస్కెట్లను అందజేశారు. ఆ ఉద్యోగి మరో మరో ఉద్యోగికి ఇచ్చేందుకు యత్నిస్తుండగా సమాచారం అందుకున్న డీఆర్‌ఐ అధికారులు వారిద్దరితో పాటు ఆ బిస్కట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడితో పాటు అతనికి సహకరించిన ఆ ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఆర్‌ఐ అధికారులు పేర్కొన్నారు. ఈ బంగారాన్ని ఆ వ్యక్తికి ఎవరు ఇచ్చారు? హైదరాబాద్‌లో ఎవరికి వీటిని డెలివరీ చేయాల్సి ఉందనే విషయాలపై ఆరా తీస్తున్నామని తెలిపారు.
For Telangana News And Telugu News