Share News

Telangana: డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం

ABN , Publish Date - May 02 , 2025 | 06:03 AM

తెలంగాణను డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చడమే తన లక్ష్యమని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం చెప్పారు. నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌, కల్తీ కల్లా విక్రయించే ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Telangana: డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం

ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం

హైదరాబాద్‌ సిటీ, మే1(ఆంధ్రజ్యోతి): తెలంగాణను డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం అన్నారు. రాష్ట్ర ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌గా నియమితులైన ఆయ న నాంపల్లి ఆబ్కారీ భవన్‌లో గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భం గా షానవాజ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ.. నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ను చెలామణీ చేస్తున్న ముఠాలు, కల్తీ కల్లుతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కేటుగాళ్లపై క ఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి

ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం

PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు

Read Latest AP News And Telugu News

Updated Date - May 02 , 2025 | 06:03 AM