Share News

PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు

ABN , Publish Date - May 01 , 2025 | 02:28 PM

PM Modi AP Visit: ఏపీలో ప్రధాని మోడీ పర్యటన షెడ్యూల్ విడుదలైంది. మే 2న మధ్యాహ్నం 2:55 గంటలకు మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో మోదీకి మంత్రులు, కూమిటి నేతలు స్వాగతం పలుకనున్నారు.

PM Modi AP Visit:  ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు
PM Modi AP Visit:

అమరావతి, మే 1: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఏపీలో పర్యటించనున్నారు. మే 2న రాజధాని అమరావతి పున: ప్రారంభకార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ ఏపీకి రానున్నారు. ఈ సందర్భంగా ఏపీలో మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఏ సమయంలో ఏపీకి రానున్నాను.. ఏయే ఏయే సమయాల్లో శంకుస్థాపనలు చేయనున్నారు.. ఎప్పుడు బహిరంగ సభలో ప్రసంగిస్తారో తెలియజేస్తూ షెడ్యూల్ విడుదలైంది. రేపు (మే2) మధ్యాహ్నం 2:55 గంటలకు మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో మోదీకి మంత్రులు, కూమిటి నేతలు స్వాగతం పలుకనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా మధ్యాహ్నం 3:15 గంటలకు వెలగపూడి సచివాలయం వద్ద ఉన్న హెలిపాడ్‌కు పీఎం చేరుకుంటారు. హెలిపాడ్ వద్ద ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఘన స్వాగతం పలకనున్నారు.


మధ్యాహ్నం 3:30 గంటలకు సభాస్థలికి చేరుకుని అమరావతి పున:ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు. రాజధాని అమరావతిలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కేంద్రం చేపట్టిన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఒక గంటా 15 నిమిషాల పాటు ప్రధాని మోదీ సభలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం 4:55 గంటలకు తిరిగి హెలికాఫ్టర్ ద్వారా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు మోదీ. అక్కడి నుంచి విమానం ద్వారా ఢిల్లీకి వెళ్లనున్నారు.

Amazon Placement: ఆ స్టూడెంట్ ప్యాకేజ్‌ చూస్తే కళ్లు చెదరాల్సిందే.. ప్రియాంక సక్సెస్ స్టోరీ


కాగా.. ప్రధాని కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సచివాలయం వెనక ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. మంత్రులు స్వయంగా అక్కడకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. సభా ప్రాంగణంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నామన్నారు. సభా ప్రాంగణం అంతా సిద్ధం అయినట్లే చెప్పారు. పార్కింగ్ వద్ద కూడా ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు మంత్రులు చెబుతున్నారు. సభా ప్రాంగణానికి పెద్ద మొత్తం జనసమీకరణ జరిగేలా కూటమి నేతలు చూస్తున్నారు. ఈ సభకు 29 గ్రామాల ప్రజలు, రైతులను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించినట్లు చెప్పారు. ప్రధాని సభకు దాదాపు 5 లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రాజధాని ప్రజల కోసం ఎనిమిది వేల బస్సు.. రాజధాని చుట్టుపక్కల గ్రామాల ప్రజల కోసం ఆరువేలకుపైగా బస్సులను సిద్ధం చేశారు.


ఇవి కూడా చదవండి

BC Janardhan: పంట నీట మునగడంపై మంత్రి ఆవేదన

ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం


Read Latest AP News And Telugu News

Updated Date - May 01 , 2025 | 02:29 PM