Share News

Financial Aid: పుస్తకాల ముద్రణకు తెలుగు వర్సిటీ ఆర్థిక సహాయం

ABN , Publish Date - May 02 , 2025 | 06:12 AM

తెలుగు రచయితలు తమ రచనల ముద్రణ కోసం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ ఆర్థిక సహాయం అందించనున్నది. దరఖాస్తుతో పాటు ముద్రణా సంస్థ కొటేషన్‌ను ఈ నెల 31లోపు వర్సిటీకి పంపించాలని రిజిస్ట్రార్‌ హనుమంతరావు తెలిపారు.

Financial Aid: పుస్తకాల ముద్రణకు తెలుగు వర్సిటీ ఆర్థిక సహాయం

హైదరాబాద్‌ సిటీ, మే 1 (ఆంధ్రజ్యోతి): తెలుగు రచయితలు తమ రచనలను ముద్రించుకోవడానికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కోట్ల హనుమంతరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు భాష, సాహిత్యం, కళలు, చరిత్ర, సంస్కృతి ఇలా ఏ అంశానికి సంబంధించిన రచనలనైనా ముద్రించుకోవడానికి సహా యం చేస్తామని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తులను వర్సిటీ వెబ్‌సైట్‌ నుంచి లేదా యూనివర్సిటీలోని విస్తరణ సేవా విభాగం నుంచి పొందవచ్చని చెప్పారు. దరఖాస్తు పూర్తి చేసి ఏదేని ముద్రణా సంస్థ నుంచి పొందిన ఒక కొటేషన్‌ను జతపరిచి ఈ నెల 31వ తేదీలోపు వర్సిటీ చిరునామాకు పంపాలని రిజిస్ట్రార్‌ తెలిపారు.


ఇవి కూడా చదవండి

ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం

PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు

Read Latest AP News And Telugu News

Updated Date - May 02 , 2025 | 06:12 AM