ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Ponguleti: ఇందిరమ్మ ఇళ్లపై అదిరిపోయే అప్డేట్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

ABN, Publish Date - Jun 04 , 2025 | 01:38 PM

ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని గత కేసీఆర్ ప్రభుత్వంలో అప్పుల్లోకి నెట్టారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం పేదల మేలు కోసం పనిచేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

Minister Ponguleti Srinivasa Reddy

ఖమ్మం జిల్లా: ఇందిరమ్మ ఇళ్లలో (Indiramma Houses) అర్హులందరికీ న్యాయం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) హామీ ఇచ్చారు. నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను మొదటి విడతలో భాగంగా అందజేస్తున్నామని ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్న తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, పేదవారి పట్ల ప్రేమ అభిమానాలు ఉన్నాయని తెలిపారు. ఇవాళ(బుధవారం) ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో గల సత్యనారాయణపురంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. వచ్చే నాలుగు సంవత్సరాల్లో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. పాలేరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉండి అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఆడబిడ్డ, తమ్ముడి కళ్లల్లో ఆనందాన్ని చూస్తుంటే భావోద్వేగానికి లోనవుతున్నామని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే మంచి పనిచేస్తే వారి నుంచి వచ్చే స్పందన గొప్పగా ఉంటుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేక పోయినా సన్నబియ్యం ఇస్తున్నామని వెల్లడించారు. పది సంవత్సరాల్లో మాజీ సీఎం కేసీఆర్‌కి రేషన్ కార్డులు కూడా ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేదని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో 19 లక్షల మంది పేర్లను కొత్తగా రేషన్ కార్డులో జమచేశామని ప్రకటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.


ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని గత కేసీఆర్ ప్రభుత్వంలో అప్పుల్లోకి నెట్టారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ధనిక రాష్ట్రంలో రూ.8 లక్షల 19 వేల కోట్ల అప్పు చేసి పోతే.. ప్రతి నెల రూ.6,500 కోట్ల వడ్డీని తమ ప్రభుత్వం కడుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకుల మాదిరిగా పేదోళ్ల గురించి మొసలి కన్నీరుని ఇందిరమ్మ ప్రభుత్వం కార్చబోదని చెప్పారు. ఇందిరమ్మ ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని మండిపడ్డారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.


ఊకదంపుడు ఉపన్యాసాలు, కాలయాపన చేసే కబుర్లు చెపితే ప్రజలు నమ్మరని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబ సభ్యులు కట్టుకున్న ప్యాలెస్‌లు, అధికారులు, ప్రజాప్రతినిధులు నివసించే బంగ్లాల మీద పెట్టిన ఖర్చు, శ్రద్ద పేదవారి ఇంటి మీద ఎందుకు పెట్టలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో రూపాయి ఖర్చు పెడితే రాజకీయంగా ఏం లాభం వస్తోందనే ఆలోచించారని అన్నారు. పేదవారికి ఖర్చు పేట్టె ప్రతి రూపాయి వారికి అందుతుందా లేదా అని కూడా కేసీఆర్ కనీసం ఆలోచించలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి

మ్యాచ్‌ఫిక్సింగ్‌గా జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశాలు

అమెరికాలో తెలుగు విద్యార్థులకు అండగా ఉంటాం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 04 , 2025 | 01:52 PM