KTR: విద్యార్థులపై ఇలాంటి చర్యలా.. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
ABN, Publish Date - Mar 16 , 2025 | 09:23 AM
KTR: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానన్న ముఖ్యమంత్రి, నిరసనలపై ఉక్కుపాదం మోపడం అత్యంత దుర్మార్గమైన చర్య అని చెప్పారు.
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలకు నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై కేటీఆర్ స్పందించారు. ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారెంటీలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కారు ఏడో గ్యారెంటీకి కూడా ఏడాదిన్నరలోనే ఘోరీకట్టిందని కేటీఆర్ విమర్శించారు.
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని కేటీఆర్ మండిపడ్డారు. ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానన్న ముఖ్యమంత్రి, నిరసనలపై ఉక్కుపాదం మోపడం అత్యంత దుర్మార్గమైన చర్య అని చెప్పారు. ప్రజాపాలనలో నిరసన తెలిపే హక్కును కాపాడాతామని అభయహస్తం మేనిఫెస్టోలోని మొదటి పేజీ, మొదటి లైన్‌లోనే ఇచ్చిన హామీ ఏమైందో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడెక్కకూడదని అల్టిమేటం జారీచేయడం ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
విద్యార్థులు తినే భోజనంలో ఇటీవల పురుగులే కాకుండా ఏకంగా బ్లేడ్లు కూడా దర్శనమిచ్చిన ఇటీవలి సంఘటన సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచిందని కేటీఆర్ ఆరోపించారు. అలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చూడాల్సింది పోయి విద్యార్థులను అణచివేయాలని చూడటం అన్యాయమని అన్నారు. నిర్బంధ పాలనతో విశ్వవిద్యాలయం విద్యార్థుల గొంతునొక్కే ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులపట్ల కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని ఇప్పటికైనా మార్చుకోకపోతే నియంత పాలనకు గుణపాఠం తప్పదని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: కేసీఆర్.. నీ కుటుంబాన్ని అదుపులో పెట్టుకో!
Venkaiah Naidu: మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలి
Matrimonial Scam: మ్యాట్రిమోనియల్ సైట్లలో నకిలీ ప్రొఫైల్స్‌తో అమ్మాయిలకు వల!
Read Latest Telangana News and Telugu News
Updated Date - Mar 16 , 2025 | 09:29 AM