Matrimonial Scam: మ్యాట్రిమోనియల్ సైట్లలో నకిలీ ప్రొఫైల్స్‌తో అమ్మాయిలకు వల!
ABN , Publish Date - Mar 16 , 2025 | 05:18 AM
మ్యాట్రిమోనియల్ సైట్లలో నకిలీ ప్రొఫైల్ పెట్టి పెళ్లి పేరుతో అమ్మాయిలను ముగ్గులోకి దింపి.. వారి నుంచి రూ.లక్షలు కొల్లగొడుతున్న మోసగాడు జూబ్లీహిల్స్ పోలీసులకు చిక్కాడు.

పెళ్లి పేరుతో రూ.లక్షలు కొల్లగొడుతున్న మోసగాడి అరెస్ట్
బంజారాహిల్స్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): మ్యాట్రిమోనియల్ సైట్లలో నకిలీ ప్రొఫైల్ పెట్టి పెళ్లి పేరుతో అమ్మాయిలను ముగ్గులోకి దింపి.. వారి నుంచి రూ.లక్షలు కొల్లగొడుతున్న మోసగాడు జూబ్లీహిల్స్ పోలీసులకు చిక్కాడు. రాజమండ్రికి చెందిన జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్ష చెరుకూరి తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో మోసాలకు పాల్పడుతూ రూ.లక్షల్లో కాజేశాడు. ఇటీవల జూబ్లీహిల్స్ పరిఽధిలో ఒక మహిళా డాక్టర్‌ను మ్యాట్రిమోనియల్ సైట్లో పరిచయం చేసుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె నుంచి రూ.10.94 లక్షలు కొల్లగొట్టాడు. ఆమె పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు నిందితుడిని శనివారం అరెస్టు చేశారు. అతడిపై మూడు రాష్ట్రాల్లో 26 కేసులున్నాయని ఏసీపీ వెంకటగిరి తెలిపారు. మూడు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న నిందితుడిపై 2016 నుంచి సైబరాబాద్‌లో కేసులు నమోదై ఉన్నట్టు చెప్పారు.