ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Natti Kumar: ఆర్ నారాయణమూర్తి వెనుక ఉన్నది ఎవరో బయట పెడతా: నట్టి కుమార్

ABN, Publish Date - May 31 , 2025 | 06:55 PM

జగన్ ప్రభుత్వంలో గత ఐదేళ్లు ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టినప్పుడు ఆర్ నారాయణమూర్తి ఎందుకు మాట్లాడలేదని ప్రముఖ నిర్మాత, దర్శకులు నట్టి కుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు. సినీ ఇండస్ట్రీకి జగన్ ఎక్కడ న్యాయం చేశారో చెప్పాలని నిలదీశారు.

Natti Kumar

అమరావతి: థియేటర్ల బంద్, పర్సంటేజీల వ్యవహారంపై ప్రముఖ నటులు ఆర్. నారాయణమూర్తి (Narayana Murthy) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌, మంత్రి కందుల దుర్గేష్‌లను ఉద్దేశించి నారాయణమూర్తి చేసిన కామెంట్స్‌పై ప్రముఖ నిర్మాత, దర్శకులు నట్టి కుమార్ (Natti Kumar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆర్ నారాయణమూర్తి వెనుక ఉన్నది ఎవరో బయట పెడతానని హెచ్చరించారు. ఇవాళ(శనివారం) హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో నట్టికుమార్ మీడియాతో మాట్లాడారు. ఆర్. నారాయణమూర్తి పవన్ కల్యాణ్, మంత్రి కందుల దుర్గేష్‌లను తప్పుపట్టారని మండిపడ్డారు. గతంలో సినీప్రముఖులు.. మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో జరిగిన సమావేశానికి నారాయణమూర్తి కూడా వెళ్లారని గుర్తుచేశారు. అప్పుడు మెగాస్టార్ చిరంజీవిని, మిగతా పెద్దలను అవమానించినప్పుడు నారాయణమూర్తి ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. చిన్న సినిమాకు ఐదో షో ఇప్పించలేనప్పుడు.. జగన్, కేసీఆర్ హయాంలో వారికి దగ్గరగా ఉన్నప్పుడు నారాయణమూర్తి ఎందుకు స్పందించలేదని నిలదీశారు నట్టి కుమార్.


జగన్ చిన్న సినిమాలకు ఏం చేశారు.

‘రాజకీయాలు మాట్లాడాలంటే మాట్లాడవచ్చు. థియేటర్ల బంద్ బ్రహ్మాస్త్రం అన్నారు మంచిది. ఫుడ్ రేట్లు ఎక్కువగా ఉంటే ఎందుకు అడగలేదు. జగన్ చిన్న సినిమాలకు ఏం చేశారు.. ఎందుకు మాట్లాడలేదు. మీరు గుత్తాధిపత్యానికి ఆధ్యం పోస్తున్నారు‌. మీ భావాలు మారాయి. కార్పొరేట్ కంపెనీలకు మద్దతు పలుకుతున్నారు. మీతో ఎవరు మాట్లాడిస్తున్నారో నాకు తెలుసు. ఆర్. నారాయణమూర్తి, పోసాని కృష్ణమురళి చిన్న సినిమాలకు ఏం చేశారు. సినీ ఇండస్ట్రీకి ఏం చేశారు. చిన్న సినిమాలకు ఐదో షో ఏది.. పుడ్ రేట్లు తగ్గాయా.. చిరంజీవిని దగ్గరుండి అవమానపరిచారు. పవన్‌కల్యాణ్ మాటలే మీకు ప్రాబ్లమా..సమస్యలను తీర్చాల్సింది ఛాంబర్, కౌన్సిల్.. అది కూడా మీకు తెలీదా.. ఎందుకు కావాలని పవన్‌కల్యాణ్‌, మంత్రి కందుల దుర్గేష్‌లని టార్గెట్ చేశారు. జగన్ ఆ రోజు రూ. 5, రూ 35లకు టికెట్ అమ్మితే ఏం చేశారు’ అని నట్టి కుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు.


ఆ నలుగురి వల్లే న్యాయం జరగట్లేదు...

‘ఇంకొక నిర్మాత జనసేన నాయకుడు అంటూ ఓ ఎగ్జిబిటర్ గురించి కామెంట్స్ చేశారు. కావాలనే జనసేన పార్టీ పేరును ఈ విషయంలోకి తెస్తున్నారు. ఆ నలుగురి వల్లే ఎవరికీ న్యాయం జరగట్లేదు.. ఈ రోజుకు ఐదో షో రాలేదు. తెలంగాణలో భారీ రేట్లకు పుడ్ అమ్ముతుంటే ఎందుకు ప్రశ్నించటం లేదు... కానీ నారాయణమూర్తి పవన్‌కల్యాణ్‌, మంత్రి కందుల దుర్గేష్‌లని విమర్శిస్తున్నారు. ఏ ఛానెల్ అయితే మీకు లైవ్ ఇచ్చిందో, ఏ నాయకుడు మీ వెనుక ఉన్నారో వాళ్లకు చెపుతున్నా... గత ఐదేళ్లు మీరు ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టారు.. ఆ రోజు మీరు వాళ్లను ఎందుకు అడగలేదు నారాయణమూర్తి. గుత్తాధిపత్యాన్ని అరికట్టాలనటం పవన్‌కల్యాణ్‌ తప్పా. జగన్ ఎక్కడ న్యాయం చేశారో చెప్పాలి. నిజమైన ఎగ్జిబిటర్‌కు నష్టం జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు.. పని కట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని, పవన్‌కల్యాణ్‌‌లని విమర్శిస్తున్నారు. ఆ రోజు, ఈ రోజు చిన్న సినిమాలకు సపోర్ట్‌గా మాట్లాడింది నేనే’ అని నట్టి కుమార్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

పీఎస్సార్‌కు మరోసారి అస్వస్థత

శ్రీకాంత్‌ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు

Read Latest AP News And Telugu News

Updated Date - May 31 , 2025 | 07:09 PM