ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Seethakka: మిస్ వరల్డ్ పోటీలపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - May 04 , 2025 | 02:13 PM

Minister Seethakka: ములుగు జిల్లాలో మంత్రి సీతక్క ఆదివారం నాడు పర్యటించారు. పలు కార్యక్రమాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ములుగు అభివద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Minister Seethakka

ములుగు: మిస్ వరల్డ్ పోటీలకు అందాల తారలు రామప్పకు రాబోతున్నారని మంత్రి సీతక్క తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తమ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పోటీలు నిర్వహిస్తుందని మంత్రి సీతక్క వెల్లడించారు. ములుగు జిల్లాకు పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యత ఉందని మంత్రి సీతక్క తెలిపారు. అందుకే ఇక్కడ మోడల్ బస్టాండ్ నిర్మిస్తున్నామని అన్నారు. నిధులు ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మంత్రి సీతక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


మంత్రి ప్రభాకర్, తాను అసెంబ్లీలో ఒకే బెంచ్‌లో కూర్చొంటామని అన్నారు. ఇవాళ(ఆదివారం)ములుగు జిల్లాలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పర్యటించారు. గట్టమ్మ ఆలయం నుంచి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రూ.5.11 కోట్లతో నిర్మిస్తున్న మోడల్ బస్టాండ్ నిర్మాణానికి మంత్రులు భూమి పూజ చేశారు. అంతకుముందు గట్టమ్మ ఆలయంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పూజలు చేశారు.


తెలంగాణ దేశానికే రోల్ మోడల్: మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తాము చేసింది కులగణనే అని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేయడం తగదని అన్నారు. తాము చేసిన కులగణనను చూసి ఓర్వలేక కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. గ్రామగ్రామాన రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆరు నెలల్లో ములుగు బస్టాండ్ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.


తమ ప్రభుత్వంలో కొత్తగూడెం అన్నిరంగాల్లో అభివృద్ధి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

భద్రాద్రి కొత్తగూడెం: తమ ప్రభుత్వంలో కొత్తగూడెం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇవాళ(ఆదివారం) కొత్తగూడెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు, ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ , నేషనల్ హైవేల అనుసంధానం, రైల్వే కనెక్టివిటీ సహా అన్ని శాశ్వత అభివృద్ధి పనులతో కొత్తగూడెంకు మహర్దశ వస్తుందని చెప్పారు. ఆదర్శ రాజకీయ విలువలతో దివంగత మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య జీవించారని కొనియాడారు. నేటి తరానికి రాజకీయ సేవ కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో నేర్పారని అన్నారు. కొత్తగూడెం చరిత్రలో నిలిచేలా చేకూరి కాశయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వకారణంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి

KTR: ప్రమాద బాధిత కుటుంబానికి కేటీఆర్‌ అండ

Ponnam Prabhakar: ఆర్టీసీ జేఏసీ నేతలను చర్చలకు పిలిచే చాన్స్‌

Ration Misuse: బియ్యం అమ్ముకుంటే రేషన్‌ కార్డు రద్దు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 04 , 2025 | 02:18 PM