Share News

Ponnam Prabhakar: ఆర్టీసీ జేఏసీ నేతలను చర్చలకు పిలిచే చాన్స్‌

ABN , Publish Date - May 04 , 2025 | 04:24 AM

ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన సమ్మె పిలుపును విరమింపజేసేందుకు ప్రభు త్వం సమాలోచనలు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆర్టీసీ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Ponnam Prabhakar: ఆర్టీసీ జేఏసీ నేతలను చర్చలకు పిలిచే చాన్స్‌

  • సర్కారు సమాలోచనలు

హైదరాబాద్‌, మే 3(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన సమ్మె పిలుపును విరమింపజేసేందుకు ప్రభు త్వం సమాలోచనలు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆర్టీసీ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జేఏసీ ఇచ్చిన సమ్మె నోటీసులోని 21 అంశాల్లో తక్షణం పరిష్కరించేందుకు ఆస్కారం ఉన్నవి, బడ్జెట్‌తో ముడిపడిన వాటి గురించి వేర్వేరుగా పూర్తిస్థాయిలో చర్చించారు. అధికారులు ఇచ్చిన వివరాల ఆధారంగా మంత్రి పొన్నం సీఎం రేవంత్‌ రెడ్డితో సమావేశమై ఆయన ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. సీఎంతో భేటీ అనంతరం ఒకటి, రెండు రోజుల్లో ఆర్టీసీ జేఏసీ నాయకులతో మంత్రి పొన్నం సమావేశమై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఈ నెల 7 నుంచి సమ్మె చేపడతామని ప్రకటించిన జేఏసీ... ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యల పరిష్కార మార్గాలు చూపితే సమ్మె ఆలోచనను విరమించుకుంటామని ఇప్పటికే తెలిపింది. ప్రపంచ అందాల పోటీలు జరిగే సమయంలో సమ్మె లు, ఆందోళనలు అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం సమ్మెను విరమింపజేయడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు, సమ్మెకు ముందు బలప్రదర్శనలో భాగంగా సోమవారం జేఏసీ ‘కార్మిక కవాతు’ చేపట్టింది. అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చింది.


ఇవి కూడా చదవండి..

ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు

ట్రాన్స్‌జెండర్లకు చోటు లేదు

హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 04 , 2025 | 04:24 AM