Share News

IPL 2025 GT vs SRH: హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం

ABN , Publish Date - May 02 , 2025 | 11:56 PM

గుజరాత్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమి చవి చూసింది. 225 లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 186 పరుగులకే చేతులెత్తేసింది.

IPL 2025 GT vs SRH: హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం
IPL 2025 SRH Lost GT Won

సన్‌రైజర్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమి చెందింది. 38 పరుగుల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించి టాప్ 2 పొజిషన్‌కు చేరుకుంది. ఈ ఓటమితో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి. సన్‌రైజర్స్‌ టాస్ గెలవడంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ పరుగుల వరద పారించింది. తొలుత సాయి సుదర్శన్ (48) జట్టుకు శుభారంభాన్ని ఇవ్వడం ఆ తరువాత శుభ్‌మన్ గిల్ (76), జోస్ బట్లర్ (64) చెలరేగి ఆడటంతో గుజరాత్ పరుగుల వరద పారించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉనద్కత్ 3, కమిన్స్, అన్సారీ చెరో వికెట్ తీశారు.


225 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ తొలి 5 ఓవర్లలో గుజరాత్‌కు దీటుగా రన్ రేట్ కొనసాగిస్తూ దృఢంగా కనిపించింది., అభిషేక్ వర్మ రాణించినా మిగతా వారు విఫలం కావడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. కేవలం 186 పరుగులకే ఆలౌట్ అయ్యింది. క్లాసెస్ (23), నితీశ్ కుమార్ రెడ్డి (21), ప్యాట్ కమిన్స్ (19) ఓ మోస్తరు పరుగులు చేశారు. చివరి ఓవర్లో నితీశ్ రెడ్డి, కమిన్స్ సిక్సులు బాదారు. కానీ మిడిల్ ఓవర్స్‌లో స్కోరింగ్ లేక చివరకు హైదరాబాద్ ఓటమి చవి చూసింది. ఇప్పటివరకూ 10 మ్యాచులు ఆడిన సన్‌రైజర్స్‌కు ఇది ఏడో ఓటమి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - May 02 , 2025 | 11:59 PM