Ration Misuse: బియ్యం అమ్ముకుంటే రేషన్ కార్డు రద్దు
ABN , Publish Date - May 04 , 2025 | 04:21 AM
ఉచితంగా ఇచ్చే బియ్యం అమ్మినవారిపై రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. మంచిర్యాలలో 11 రేషన్ కార్డులు రద్దుచేసి, కేసులు నమోదు చేశారు

రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారుల హెచ్చరికలు
హైదరాబాద్, మే 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే సన్నబియ్యాన్ని అమ్ముకుంటే చర్యలు తప్పవని రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలా అమ్ముకున్నవారి రేషన్ కార్డులు రద్దుచేస్తామని ఇప్పటికే ప్రకటించిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండంలోని అచలాపూర్ గ్రామంలో శనివారం అధికారులు 11 రేషన్ కార్డులు రద్దుచేశారు. వీరు రూ.16 చొప్పున 1.91 క్వింటాళ్ల బియ్యాన్ని అమ్ముకున్నారని అధికారులు తెలిపారు. రేషన్ బియ్యం అమ్మినవారితోపాటు కొన్నవారిపైనా కేసులు నమోదుచేస్తామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు.