Minister Ponnam Prabhakar: బీసీ కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచింది
ABN, Publish Date - Jun 02 , 2025 | 02:03 PM
రైతులకు తమ ప్రభుత్వంలో పెట్టుబడి సాయం పెంచామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని ఉద్ఘాటించారు.
సిద్దిపేట: బీసీ కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) వ్యాఖ్యానించారు. ఇవాళ (జూన్2) తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలోని క్రికెట్ స్టేడియంలో జాతీయ జెండాను మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ మనుచౌదరి ఆవిష్కరించారు. సిద్దిపేట పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడానికి చాలా కార్యక్రమాలు చేపట్టామని వివరించారు మంత్రి పొన్నం ప్రభాకర్.
రైతులకు పెట్టుబడి సాయం పెంచామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని ఉద్ఘాటించారు. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని తెలిపారు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించామని చెప్పుకొచ్చారు. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. డ్రగ్స్‌పై నిఘా ఏర్పాటు చేసి, నిర్ములించామని చెప్పారు. ప్రజాపాలనే పరమావధిగా, జిల్లాను మరింతగా అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
విశ్వవేదికపై తెలంగాణను అగ్రగామిగా నిలబెడుతున్నాం: మంత్రి శ్రీధర్ బాబు
విశ్వవేదికపై తెలంగాణను అగ్రగామిగా నిలబెడుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) తెలిపారు. ఇవాళ(జూన్2) తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లో జాతీయ జెండాను మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తున్నామని ప్రకటించారు. తెలంగాణకి వేల కోట్ల పెట్టుబడులు సాధిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ వేదికగా గ్లోబల్ ఈవెంట్స్‌ను నిర్వహించామని తెలిపారు. భూ భారతితో రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాజకీయం చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. తెలంగాణలో ఇతర పార్టీలకి మనుగడ లేదని చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల డ్రామాను ప్రజలు చూస్తున్నారని అన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనని కవిత చెప్పిందని గుర్తుచేశారు. తమకు బలమైన నాయకత్వం ఉందని స్పష్టం చేశారు. ఎవరు కుట్రలు చేస్తున్నారో బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు తేల్చుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందాల.. టెండర్ నోటిఫికేషన్ రద్దు చేయాలి
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jun 02 , 2025 | 02:17 PM