ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Konda Surekha: నాంపల్లి కోర్టు కేసుపై స్పందించిన మంత్రి కొండా సురేఖ

ABN, Publish Date - Aug 02 , 2025 | 07:02 PM

నాంపల్లి కోర్టు కేసుపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన కేసుకు సంబంధించి గౌర‌వ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకెళ్లాల‌ని స్ప‌ష్టం చేసిందని అన్నారు. తనకు ఈ దేశ న్యాయవ్య‌వ‌స్థ మీద అపార‌మైన గౌర‌వం ఉందని చెప్పుకొచ్చారు.

Minister Konda Surekha

హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై (Minister Konda Surekha) క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు (Nampally Court) ఆదేశించింది. ఫోన్‌ ట్యాపింగ్‌, డ్రగ్స్‌‌తో సహా నటి సమంత విడాకుల అంశంలో సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) పరువునష్టం దావా కేసు వేశారు. ఈ మేరు విచారణ జరిపిన నాంపల్లి కోర్టు.. మంత్రి కొండా సురేఖపై ఈనెల(ఆగస్టు) 21వ తేదీలోగా క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. అయితే కోర్టు తీర్పుపై మంత్రి కొండా సురేఖ స్పందించారు.

తన కేసుకు సంబంధించి గౌర‌వ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకెళ్లాల‌ని స్ప‌ష్టం చేసిందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. తనకు ఈ దేశ న్యాయ వ్య‌వ‌స్థ మీద అపార‌మైన గౌర‌వం ఉందని చెప్పుకొచ్చారు. ఈ కేసులు, కొట్లాట‌లు తనకు కొత్త కాదని... తన జీవిత‌మే ఒక పోరాటమని ఉద్ఘాటించారు. ఏ కేసులో అయినా గౌర‌వ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోమ‌ని చెప్ప‌డం స‌ర్వ‌సాధార‌ణమని.. ఇది జ‌రిగి రెండు రోజులు అయిందని గుర్తుచేశారు. కొండా సురేఖ పేరు అన‌గానే ఎంత‌టి ఉత్సాహం అంటే కొంత‌మంది రిపోర్టర్లు తన కేసులో కోర్టు తీర్పు ఇచ్చింద‌ని రాస్తున్నారని.. ఇది వారి విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నానని తెలిపారు. చివ‌రిగా తాను చెప్పేది ఒక‌టేనని, చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోతుందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్‌ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి

ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 02 , 2025 | 07:38 PM