CP Sajjanar:హైదరాబాద్ సీపీ సజ్జనార్‌తో సినీ ప్రముఖుల భేటీ
ABN, Publish Date - Nov 18 , 2025 | 10:14 AM
హైదరాబాద్ సీపీ సజ్జనార్‌తో సినీ ప్రముఖులు సోమవారం నాడు సమావేశం అయ్యారు. ఈ భేటీలో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌలి, నిర్మాతలు దిల్ రాజ్, దగ్గుబాటి సురేశ్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీపీ సజ్జనార్‌తో సినీ ప్రముఖులు చర్చించారు. అనంతరం సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఒక పెద్ద పైరసీ నెట్‌వర్క్‌ను ఛేదించారని ప్రశంసించారు సీపీ సజ్జనార్.
హైదరాబాద్ సీపీ సజ్జనార్‌తో సినీ ప్రముఖులు సోమవారం నాడు సమావేశం అయ్యారు.
ఈ భేటీలో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌలి, నిర్మాతలు దిల్ రాజ్, దగ్గుబాటి సురేశ్ బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీపీ సజ్జనార్‌తో సినీ ప్రముఖులు చర్చించారు. అనంతరం సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు.
ఒక పెద్ద పైరసీ నెట్‌వర్క్‌ను ఛేదించామని తెలిపారు. 65+ మిర్రర్ వెబ్‌సైట్‌లను నిర్వహిస్తూ సినిమా పరిశ్రమకు వేల కోట్ల నష్టాన్ని కలిగించే ఐబొమ్మ/బప్పం టీవీ భారీ సినిమా పైరసీ రాకెట్ వెనుక ఉన్న ప్రధాన నిందితుడు ఇమ్మడి రవిని అరెస్టు చేశామని వ్యాఖ్యానించారు సీపీ సజ్జనార్.
నిందితుడు ఇమ్మడి రవి లక్షలాది మంది వినియోగదారులను పైరసీ సైట్ల నుంచి 1win, 1xbet వంటి బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లకు చట్టవిరుద్ధంగా మళ్లిస్తున్నారని సజ్జనార్ పేర్కొన్నారు.
ఇది పెద్ద ఎత్తున ఆర్థిక దోపిడీకి దారితీసిందని చెప్పుకొచ్చారు. ఈ ఆపరేషన్ కాంతార చాప్టర్ 1, డ్యూడ్ ఈ ప్లాట్‌ఫామ్‌లలో చట్టవిరుద్ధంగా అప్‌లోడ్ చేశారని తెలిపారు సీపీ సజ్జనార్.
కొత్తగా విడుదలైన తెలుగు చిత్రాల పైరసీపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.
Updated Date - Nov 18 , 2025 | 10:17 AM