ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TG Bharat On investors summit: నవ్యాంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టిలో భాగస్వామ్యం అందిస్తాం: గల్ఫ్ తెలుగు వైశ్యవ్యాపారవర్గాలు

ABN, Publish Date - Oct 28 , 2025 | 09:18 PM

నవ్యాంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిలో దుబాయి, గల్ఫ్ దేశాల్లోని తెలుగు వైశ్య వ్యాపాస్థులు తమ వంతుగా పూర్తిగా సహకరిస్తామని సంసిద్ధత వ్యక్తం చేశారు.

TG Bharat On investors summit

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: నవ్యాంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) చేస్తున్న కృషిలో దుబాయి (Dubai), గల్ఫ్ (Gulf) దేశాల్లోని తెలుగు వైశ్య వ్యాపాస్థులు తమ వంతుగా పూర్తిగా సహకరిస్తామని సంసిద్ధత వ్యక్తం చేశారు. వచ్చే నెల(నవంబరు)లో విశాఖపట్టణంలో జరుగనున్న పెట్టుబడుల సదస్సుకు యుఏఈలోని వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలను ఆహ్వనించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట ఇటీవల దుబాయికు వచ్చిన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ (TG Bharat)కు దుబాయిలోని ప్రవాసాంధ్ర వైశ్య ప్రముఖుడు, తెలుగు వైశ్య వ్యాపారస్థులు , పారిశ్రామికవేత్తల కూటమి WVBG కశ్యప అధ్యక్షుడు గణేశ్ రాయపూడి అధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి భరత్ రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో అన్ని రంగాల్లోనూ ఉన్న వ్యాపార ఆవకాశాలను వారికి వివరించారు.

దుబాయి, ఇతర దేశాల్లో ఏలాంటి సమస్యలు లేకుండా తమ వ్యాపారాలు కొనసాగుతున్నప్పటికీ మాతృభూమిపై మమకారంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా తాము అడుగుపెడుతామని తద్వార చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యాపారాల అభివృద్ధికి అస్కారం ఉంటుందని గణేశ్ మంత్రి భరత్‌కి వివరించారు. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా ఆవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాపారవేత్తగా ఎదగాలని ఆక్షాంక్షిస్తూ అందుకు తాము సంపూర్ణ సహాయసహాకారాలు అందిస్తామని కూడ గణేశ్ స్పష్టం చేశారు.

బంగారు నగరంగా ప్రసిద్ధిగాంచిన దుబాయి ఆర్థికాభివృద్ధిలో గుజరాతీ వ్యాపారవేత్తలు కీలక భూమిక పోషించగా కాలక్రమేణా దుబాయి, ఇతర ఏమిరేట్లలో ఉద్యోగాలు చేయడానికి వచ్చి ఆ తర్వాత ఉద్యోగాలు మానేసి వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో అనేక మంది తెలుగు వైశ్యులు స్థిరపడ్డారు. దుబాయిలోని వివిధ వైశ్య ప్రముఖులు సామాజిక, సాంస్కృతిక రంగాల్లో కూడా అగ్రభాగాన ఉండటమే కాకుండా సంపద సృష్టిలో తమతో పాటు ఇతర సామాజిక వర్గాలను కలుపుకోని ముందుకు వెళ్తున్నారు. అమెరికా, ఆఫ్రికా దేశాలకు చెందిన అనేక మంది తెలుగు వైశ్యుల వ్యాపారాలు కూడా దుబాయి కేంద్రంగా కొనసాగుతున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

ఇల్లు శుభ్రం చేయని భర్తపై కత్తితో దాడి.. యూఎస్‌లో భారత సంతతి మహిళ అరెస్టు

చంద్రబాబు యూఏఈ పర్యటన.. దుబాయ్‌లో సీఎంకు ఘన స్వాగతం

Read Latest and NRI News

Updated Date - Oct 28 , 2025 | 09:22 PM