Home » NRI
తానా(తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా) మిన్నియాపాలిస్‌లో నిర్వహించిన ఫుడ్ డ్రైవ్ విజయవంతమైంద. ‘Giving Back to the Community’ అనే నినాదం తో ఈ సంవత్సరం పలు సేవా కార్యక్రమములో పాల్గొని సేవయే తమ ప్రధమ కర్తవ్యంగా ముందుకి వెళుతోంది.
పాత భవనాల్లో ఉండే 'ఆస్బెస్టాస్' వల్ల కార్మికులకు కలిగే ఆరోగ్య ప్రమాదాలను ఈ బృందం గుర్తించింది. దానికి పరిష్కారంగా ఒక అత్యాధునిక రోబోటిక్ వ్యవస్థను ప్రతిపాదించింది. నిపుణుల సలహాలు తీసుకుంటూ.. క్షేత్రస్థాయి పరిశోధనలు చేసి వీరు రూపొందించిన ఈ 'ఇన్నోవేషన్ ప్రాజెక్ట్' అందరి ప్రశంసలు అందుకుంది.
తెలంగాణ విమానయాన తయారీ రంగంలో వృత్తి నైపుణ్యత పెంచేందుకు తనవంతు కృషి చేస్తానని అమెరికాలోని బోయింగ్ విమాన తయారీ సంస్థ శాస్త్రవేత్త, పరిశోధన విభాగ అధిపతి ప్రో. మామిడాల రాములు అన్నారు.
గుంటూరు నాట్స్ ఆధ్వర్యంలో జానపద సంబరాలు ఘనంగా జరిగాయి. తప్పెటగుళ్లు, దరువులు, కోలాటాల సందడి.. తెలుగు జానపద శోభను ప్రతిబింబించాయి.
సెయింట్ లూయిస్‌లో నివసించే ప్రవాస ఆంధ్రుల కోసం ఉచిత ఆహార సేకరణ చేపట్టింది తానా సౌత్ సెంట్రల్ విభాగం. అందులో భాగంగా సుమారు 200 కుటుంబాలకు సరిపోయే ఆహారాన్ని సేకరించి ఫుడ్ బ్యాంక్‌కు విరాళమందించింది.
ఛార్లెట్‌లోని రూఫ్ అబోవ్ షెల్టర్ వద్ద ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో సుమారు 200 మందికి పిజ్జా, వింగ్స్, సోడాతో కూడిన ఆహారాన్ని అందించారు. దీనితో పాటు 1,000 పౌండ్ల బరువున్న 400 క్యాన్డ్ ఫుడ్ ఐటమ్స్ బ్యాగులను విరాళంగా అందజేశారు.
అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో వర్జీనియాలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవిని ఘనంగా సన్మానించారు. స్థానిక ప్రవాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ శ్రీదేవి తన ప్రేరణాత్మక జీవిత కథను సభికులతో పంచుకున్నారు.
ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ వచ్చేనెలలో అమెరికాలో పర్యటించనున్నారు. అక్కడి తెలుగు ఎన్నారై కమ్యూనిటీతో సమావేశం కానున్నారు. ఏపీలోకి పెట్టుబడులు లక్ష్యంగా లోకేష్ పర్యటన ఉంటుందని సమాచారం. ఈ సందర్భంగా ఎన్నారై టీడీపీ వింగ్‌తో లోకేష్ ఆత్మీయ భేటీ జరుపనున్నారు.
డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో శంకర నేత్రాలయ ఫండ్‌రైజింగ్ సంగీత కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. పలువురు దాతలు విరాళాలను అందించారు.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం , టాంటెక్స్ సాహిత్య వేదిక 'నెల నెలా తెలుగువెన్నెల' 220 వ సాహిత్య సదస్సు.. డాలస్ టెక్సాస్‌లోని సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. ' మహాకవి వాక్పతిరాజు - సాహితీ విహంగ వీక్షణం ' అంశం పై ముఖ్య అతిథి శ్రీ పరిమి శ్రీరామనాథ్ ప్రసంగం సాహితీ ప్రియులను విశేషంగా అలరించింది.