Share News

TPAD అధ్యక్షురాలిగా లక్ష్మి పోరెడ్డి.. వరుసగా మూడోసారి మహిళకే పట్టం

ABN , Publish Date - Jan 23 , 2026 | 09:30 PM

‘డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి’ అధ్యక్షురాలిగా లక్ష్మి పోరెడ్డి ఎంపికయ్యారు. డల్లాస్‌లో అత్యంత ప్రభావవంతమైన తెలుగు సంస్థకు అధ్యక్షురాలిగా వరుసగా మూడవసారి ఒక మహిళే ఎన్నిక కావడం విశేషం.

TPAD అధ్యక్షురాలిగా లక్ష్మి పోరెడ్డి.. వరుసగా మూడోసారి మహిళకే పట్టం
Dallas Telangana Praja Samithi,

ఇంటర్నెట్ డెస్క్: డల్లాస్‌, టెక్సాస్‌లో శక్తివంతమైన, ప్రభావవంతమైన తెలుగు సంస్థగా.. తెలుగు ప్రజల మన్ననలు పొందుతున్న ‘డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి’ (TPAD) 2026 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఎంతో ఘనంగా జరిగింది. డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి గత 12 ఏళ్లలో టీప్యాడ్‌, డల్లాస్‌లోని ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. సమాజ సేవ, సంస్కృతి పరిరక్షణతో పాటు మంచి నాయకులను తీర్చిదిద్దడంలో అద్భుతమైన చరిత్ర కలిగిన టీప్యాడ్‌, ఫ్రిస్కో, టెక్సాస్‌లోని ఎలిగెన్స్ బాల్‌రూమ్‌లో స్థానిక కమ్యూనిటీ నాయకులు, మద్దతుదారుల సమక్షంలో తన 13 వ ఎగ్జిక్యూటివ్ టీమ్‌ తో ప్రమాణస్వీకారం చేయించింది.


టీప్యాడ్ అధ్యక్షురాలిగా లక్ష్మి పోరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మహిళలే అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. మహిళా సాధికారతకు, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి టీప్యాడ్ ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది గొప్ప నిదర్శనం. టీప్యాడ్‌ చరిత్ర, నేపథ్యంపై విస్తృత అవగాహన కలిగిన వీణా యలమంచిలి కార్యక్రమాన్ని సాఫీగా నిర్వహించారు. సీనియర్ టీప్యాడ్‌ నాయకులు, ఫౌండేషన్ కమిటీ సభ్యుడు రావు కల్వాల, రఘువీర్ బండారు (FC ఛైర్), అజయ్ రెడ్డి (FC వైస్ ఛైర్)లతో ప్రమాణ స్వీకారం చేయించారు. టీప్యాడ్‌ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు సుధాకర్ కలసాని, కార్యవర్గ సభ్యులు, పదాధికారులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

dallas.jpg


కొత్త కమిటీ సభ్యులు గా లక్ష్మి పోరెడ్డి (అధ్యక్షురాలు), శ్రీనివాస్ అన్నమనేని (ఉపాధ్యక్షుడు), గాయత్రి గిరి (కార్యదర్శి), శివ కొడిత్యాల (సహ కార్యదర్శి), ఆదిత్య రెడ్డి (ఖజాంచీ), దీపిక దీపికా రెడ్డి (సహ ఖజాంచీ) ఎన్నికయ్యారు. నూతన ఈసీ సభ్యులుగా బాల గణపవరపు, మాధవి ఓంకార్, శ్రవణ్ కుమార్ నిడిగంటి, హరిక పల్వాయి, సాధన రెడ్డి, ధాత్రి బల్లమూడి, బద్రి బియ్యపు, తిలక్ కుమార్ వన్నంపుల, జనకిరామ్ మండాది ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా నూతనంగా నియమితులైన బోర్డ్ సభ్యులు గా రవికాంత్ మామిడి, అశోక్ పొద్దుటూరి, రోజా అడెపు, మాధవి సుంకిరెడ్డి, రామ్ అన్నాడి, అశోక్ కొండాల, పాండురంగ రెడ్డి పల్వాయి, బుచ్చి రెడ్డి గోలితో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే రవికాంత్ మామిడి (BOT ఛైర్), లింగా రెడ్డి ఆల్వా (BOT కోఆర్డినేటర్), రోజా అడెపు (BOT వైస్ ఛైర్)లకు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

dallas3.jpg


టీప్యాడ్‌ 2026 కార్యవర్గం :

ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా లక్ష్మి పోరెడ్డి (President), శ్రీనివాస్ అన్నమనేని (Vice President), గాయత్రి గిరి (Secretary), శివ కొడిత్యాల (Joint Secretary), ఆదిత్య రెడ్డి (Treasurer), దీపిక దీపికా రెడ్డి (Joint Treasurer), స్వప్న తుమ్మపాల, నిఖిల్ కందుకూరి, ప్రశాంత్ నిమ్మని, మాధవి ఓంకార్, స్నేహా రెడ్డి, సంతోష్ రెగొండ, సాధన రెడ్డి, ధాత్రి బల్లమూడి, బద్రి బియ్యపు, శ్రవణ్ కుమార్ నిడిగంటి, హరిక పల్వాయి, తిలక్ కుమార్ వన్నంపుల,రత్న వుప్పల, బాల గణపవరపు నియమితులయ్యారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీ‌లుగా రవికాంత్ మామిడి (BOT ఛైర్), రోజా అడెపు (BOT వైస్ ఛైర్), లింగా రెడ్డి ఆల్వా (BOT కోఆర్డినేటర్), మాధవి సుంకిరెడ్డి, రమణ లష్కర్, పాండురంగ రెడ్డి పల్వాయి, రామ్ అన్నాడి, బుచ్చి రెడ్డి గోలి, అశోక్ కొండాల, పవన్ గంగాధర, సుధాకర్ కలసాని, అశోక్ పొద్దుటూరిలను నియమించారు. అలాగే ఫౌండేషన్ కమిటీ సభ్యులుగా రఘువీర్ బండారు (FC ఛైర్), అజయ్ రెడ్డి (FC వైస్ ఛైర్), జనకిరామ్ మండాది, ఉపేందర్ తెలుగు, రాజ్ గోంధి, మహేందర్ కమిరెడ్డిలను నియమించారు.


ప్రమాణ స్వీకార అనంతరం రానున్న రోజుల్లో రక్తదాన శిబిరాలు, ఆహార పంపిణీ కార్యక్రమాలు, తెలంగాణ సాంస్కృతిక వేడుకల నిర్వహణ, బతుకమ్మ, దసరా సంబరాలను ఘనంగా నిర్వహిస్తామని నూతన కార్యవర్గం ప్రకటించింది. గత 12 సంవత్సరాలుగా టీప్యాడ్‌కు నిరంతర మద్దతు అందిస్తున్న సపోర్టర్లు, స్పాన్సర్లకు టీప్యాడ్‌ నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.


ఇవీ చదవండి:

భయమెరుగని నాయకత్వ పటిమకు నేతాజీ ప్రతీక: ప్రధాని మోదీ

బ్రెజిల్‌ ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్నా: ప్రధాని మోదీ

Updated Date - Jan 23 , 2026 | 09:34 PM