కేరళలో గుజరాత్ తరహా మార్పులు వస్తాయి: ప్రధాని మోదీ
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:26 PM
కేరళలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కేరళలలో భారీ మార్పులు జరగబోతున్నాయన్నారు. గుజరాత్‌లో బీజేపీ విజయం ఒక నగరం నుంచే ప్రారంభమైందని.. ఇదే సీన్ కేరళలోనూ జరుగుతుందన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ కేరళ రాజధాని తిరువనంతపురంలో చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆయన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ‘రానున్న రోజుల్లో కేరళాలో భారీ మార్పులు వస్తాయి. గుజరాత్‌లో బీజేపీ విజయం ఒక నగరం నుంచి ప్రారంభమైంది. కేరళలోనూ అదే సీన్ రిపీట్ అవుతుంది. ఇటీవల తిరువనంతపురం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని నమోదు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. దీన్ని బట్టి ప్రజలకు బీజేపీపై విశ్వాసం పెరుగుతోందని స్పష్టమవుతోంది. ఇదే ఇక్కడ పెద్ద రాజకీయ మార్పునకు నాంది పలుకుతుంది’ అని అన్నారు.
ఈ సందర్భంగా అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF), కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(UDF)ల అవినీతిని అంతం చేస్తామన్నారు ప్రధాని మోదీ. ‘రానున్న ఎన్నికల్లో కేరళలలో భారీ మార్పులు వస్తాయి.. ఇప్పుడు ప్రజలకు అభివృద్ది చేసే ప్రభుత్వం ఎంతో అవసరం.. ఆ పని మా ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటివరకు పాలించిన పార్టీలు రాష్ట్రాన్ని దారుణంగా దోచుకున్నాయి. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌లకు జెండాలు వేరే. కానీ వాటి అజెండా మాత్రం ఒక్కటే.. అదే రాష్ట్రాన్ని దోచుకోవడం. ఇక కేరళాలో భారీ మార్పులు తీసుకురావడం మీ చేతుల్లోనే ఉంది. ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచి.. మాతో చేతులు కలిపండి. శబరిమల ఆలయంలో బంగారు చోరీ చేసిన మోసగాళ్లను ఎవరినీ వదిలిపెట్టం.. న్యాయ విచారణ జరిపిస్తాం’ అని మోదీ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కు