Share News

హ్యూమన్ ట్రాఫికింగ్‌పై అమెరికాలో స్టింగ్ ఆపరేషన్.. పట్టుబడిన వైసీపీ కార్యకర్త.!

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:50 PM

అమెరికాలో మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్)ను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో జార్జియా రాష్ట్రంలోని అట్లాంటా నగర పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన భారీ అండర్‌కవర్ ఆపరేషన్‌లో ఒక తెలుగు వ్యక్తితో సహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగానే కాకుండా అమెరికాలో నివసిస్తున్న తెలుగు సమాజంలో కూడా తీవ్ర చర్చకు దారితీసింది..

హ్యూమన్ ట్రాఫికింగ్‌పై  అమెరికాలో స్టింగ్ ఆపరేషన్.. పట్టుబడిన వైసీపీ కార్యకర్త.!
Atlanta Human Trafficking

అట్లాంటా: అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో నిర్వహించిన భారీ హ్యూమన్ ట్రాఫికింగ్ (మానవ అక్రమ రవాణా) నిరోధక ఆపరేషన్‌లో ఒక తెలుగు వ్యక్తితో సహా ఎనిమిది మంది అరెస్ట్ అయ్యారు. అట్లాంటా శివారు ప్రాంతాలైన శాండీ స్ప్రింగ్స్, డన్వుడీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ అండర్ కవర్ ఆపరేషన్‌లో మేరియెట్టాకు చెందిన వైసీపీ కార్యకర్త సుహృత్ రెడ్డి పట్టుబడటం స్థానిక తెలుగు కమ్యూనిటీలో సంచలనం సృష్టిస్తోంది.


ఏం జరిగిందంటే..?

జనవరి 29, 30 తేదీల్లో ‘ఆపరేషన్ శాండీ స్ప్రింగ్స్ గార్డియన్’ పేరుతో పోలీసులు వ్యభిచార ముఠాలు, మానవ అక్రమ రవాణా లక్ష్యంగా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. అట్లాంటాలోని పవర్స్ ఫెర్రీ రోడ్ సమీపంలోని హోటళ్లలో ఈ సోదాలు జరిగాయి. అక్రమంగా లైంగిక కార్యకలాపాలకు పాల్పడటం, వ్యభిచారం కోసం సంప్రదించడం వంటి నేరాల కింద వీరిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిపై 'సోలిసిటేషన్ ఫర్ ఇల్లిసిట్ సెక్సువల్ యాక్ట్' కింద కేసులు నమోదు చేశారు. ఈ ఆపరేషన్‌లో సుహురుత్ రెడ్డితో పాటు మరో ఏడుగురు అరెస్ట్ అయ్యారు.


కొనసాగుతున్న విచారణ..

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే తెలుగు వారు.. ఇలాంటి నేరాల్లో పట్టుబడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ఇలాంటి ఆపరేషన్లు నిరంతరం చేపడతామని అమెరికన్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది. హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి నేరాల్లో పట్టుబడటం వల్ల అమెరికాలో కఠినమైన శిక్షలతో పాటు వీసా రద్దు, దేశ బహిష్కరణ వంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రతి లడ్డూ కౌంటర్‌లో యూపీఐ పేమెంట్‌!

సైబర్ నేరగాళ్ల వేధింపులు తాళలేక.. వ్యక్తి ఆత్మహత్య

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 09 , 2026 | 03:20 PM