ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వీడు మామూలోడు కాదు.. రెండు రాష్ట్రాల్లో 90 ఇళ్లలో..

ABN, Publish Date - May 15 , 2025 | 11:24 AM

వీడు మామూలోడు కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో, మూడు పేర్లతో మొత్తం 90 చోరీలకు పాల్పడిన గజదొంగ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఏది ఎంతకాలం ఆగదన్నట్లుగా.. తిప్పికొడితే పాతికేళ్లు కూడా లేని ఇతగాడు మొత్తం 90 చోరీలు చేశాడంటే ముక్కున వేలేసుకోవాల్సిందే మరి. ఇక వివరాల్లోకి వెళితే..

- నిందితుడి అరెస్ట్‌

విశాఖపట్నం: రెండు తెలుగు రాష్ట్రాల్లో 90 చోరీలకు పాల్పడిన గజదొంగను అరెస్టు చేసినట్టు క్రైమ్‌ ఏడీసీపీ మోహన్‌రావు తెలిపారు. ఎంవీపీ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. విశాఖపట్నం(Vishakapatnam) మధురానగర్‌లోని రాధామాధవ టవర్స్‌లో మార్చి ఒకటో తేదీన జరిగిన దొంగతనం కేసులో నిందితుడు హైదరాబాద్‌(Hyderabad)లోని జూబ్లీహిల్స్‌కు చెందిన తిప్పరాజు రామకృష్ణ అలియాస్‌ రాము అలియాస్‌ అభిరామ్‌, అలియాస్‌ శ్రీను(26)ను అరెస్టు చేసినట్టు తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Minister Lokesh: అనంతపురంలో మంత్రి నారా లోకేష్ పర్యటన


ఈ చోరీలో 23 తులాల బంగారం, రూ.లక్ష నగదు దొంగిలించినట్టు చెప్పారు. అపహరించిన సొత్తును హైదరాబాద్‌లో ఉంటున్న నిందితుడి మేనల్లుడు అశోక్‌, అతడి సోదరి భాగ్యమ్మ వద్ద దాస్తూ ఉండేవాడు. ఈ కేసులో నిందితుడి నుంచి రూ.పది వేలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. అలాగే, నిందితుడు తెలంగాణ(Telangana) లోని పలు ప్రాంతాల్లో సైతం చోరీలకు పాల్పడి ఉండడంతో దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌ పోలీసులు ఇంతకు ముందు శ్రీనును అరెస్టు చేశారు.


ఈ క్రమంలో నిందితుల నుంచి రూ.3.40 లక్షలు, 50 గ్రాములు, 26 గ్రాముల రెండు బంగారు నెక్లెస్‌లు, ఏడు గ్రాముల చెవిరింగ్‌ల జత స్వాధీనం చేసుకున్నట్టు ఏడీసీపీ మోహన్‌రావు తెలిపారు. నిందితుడు శ్రీను తెలుగు రాష్ట్రాల్లో 79 ఇళ్లల్లో చోరీలకు పాల్పడినట్టు చెప్పారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. సమావేశంలో ఏసీపీ లక్ష్మణరావు, సీఐ చక్రధర్‌, ఎస్సై రాజు పాల్గొన్నారు. కేసు పరిశోధనలో చురుగ్గా వ్యవహరించిన సిబ్బందిని అధికారులు అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగొస్తున్న బంగారం ధరలు

కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టులు హతం

High Court: ‘దోస్త్‌’పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

Read Latest Telangana News and National News

Updated Date - May 15 , 2025 | 11:24 AM