Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగొస్తున్న బంగారం ధరలు
ABN , Publish Date - May 15 , 2025 | 06:30 AM
Gold Rate Today: హైదరాబాద్ నగరంలో నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 96060 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 88050 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 72040 దగ్గర ట్రేడ్ అయింది.

ఆపరేషన్ సిందూర్ తర్వాత బంగారం ధరల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. అంతకు ముందు లక్ష రూపాయలకు చేరిన బంగారం ధరలు.. యుద్ధం తర్వాత తగ్గుతూ వస్తున్నాయి. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు 96 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. పరిస్థితులను చూస్తుంటే ధరలు మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. బంగారం కొనాలనుకునే వారికి.. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది సరైన సమయం అని చెప్పొచ్చు. రానున్నకాలంలో బంగారం మళ్లీ ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది.
ఈ రోజు బంగారం ధరలు ఇలా..
గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం.. హైదరాబాద్ నగరంలో నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 96060 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 88050 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 72040 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, ఈ రోజు 18,22,24 క్యారెట్ల బంగారంపై 10 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు 96050 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 88040 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 72030 దగ్గర ట్రేడ్ అవుతోంది.
వెండి ధరలు ఇలా..
హైదరాబాద్ నగరంలో బంగారంతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతీ నిత్యం తగ్గుతూనే వస్తున్నాయి. నిన్న మహానగరంలో.. 100 గ్రాముల వెండి ధర 10900 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 109000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాములపై 10 రూపాయలు, కేజీపై 100 రూపాయలు తగ్గింది. ఈ రోజు 100 గ్రాముల వెండి ధర 10890 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ బంగారం ధర 1,08,900 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి
ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని సమాధానం చెప్పాలి