ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: అంతర్జాతీయ యోగాడేపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

ABN, Publish Date - May 16 , 2025 | 06:31 PM

CM Chandrababu: అంతర్జాతీయ యోగాడేపై సీఎం చంద్రబాబు శుక్రవారం నాడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్నంలో జరిగే యోగాడేలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొంటారని చెప్పారు.

CM Chandrababu Naidu

అమరావతి: అంతర్జాతీయ యోగాడేపై (International Yoga Day) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) ఏపీ సచివాలయంలో ఇవాళ(శుక్రవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. మే 21వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు యోగా మంత్‌‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి గ్రామంలో యోగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జూన్ 21వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ యోగా డే చరిత్రలో నిలిచి పోవాలని ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖపట్నం పర్యటనను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.


రికార్డు సృష్టించేలా విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగాడేకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఏపీవ్యాప్తంగా ప్రతి గ్రామం, వార్డులో కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నెలరోజుల పాటు యోగా ప్రాక్టీస్ చేసిన వారికి సర్టిఫికెట్ అందజేస్తామని తెలిపారు. విశాఖపట్నంలో లక్షల మందితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ యోగాసనాలు చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆర్కే బీచ్ నుంచి సముద్రతీరం పొడవునా లక్షల మందితో యోగా డే నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. యోగా డే అనంతరం కూడా ఏపీలో యోగా సాధన ఒక వ్యాపకంగా మారాలని సూచించారు. జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొనే అంతర్జాతీయ యోగాడే కార్యక్రమ నిర్వహణపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు


వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలతో సీఎం చంద్రబాబు సమీక్ష

అలాగే.. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇవాళ(శుక్రవారం) ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇకపై రైతులతో బైబ్యాక్ ఒప్పందం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రైతుల దగ్గర మిగిలిన పొగాకును కంపెనీలు కొనాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. క్వింటాల్‌కు రూ.12,500 ధర చెల్లించాలని ఆదేశించారు. ధర తగ్గకూడదు, కొనుగోళ్లు ఆగకూడదని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తమ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఉపేక్షించేది లేదని, చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు. అధికారులు, ట్రేడర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. కిలోకు రూ.500 ధర తగ్గకుండా కోకో గింజల కొనుగోళ్లు చేయాలని అన్నారు. కోకో కొనుగోళ్లకు త్వరలో ఆయిల్‌పామ్ తరహా విధానం తీసుకురాబోతున్నామని ప్రకటించారు. తక్కువ ధరతో నష్టపోయిన మిర్చి రైతుల జాబితా రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. సన్నరకాలు పండించేలా వరి రైతులను ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 16 , 2025 | 06:57 PM