Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
ABN , Publish Date - May 16 , 2025 | 01:25 PM
Amaravati: సీఎం చంద్రబాబు నివాసం సమీపంలోని తపోవనం వద్ద కరకట్ట రోడ్డు నుంచి ప్రమాదవశాత్తు కారు కింద పడింది. కారు ముఖ్యమంత్రి నివాసం సమీపంలో బోల్తాపడడం, ఎవ్వరికి పెద్దగా గాయలు కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తక్షణం కారులో ఉన్న ఇద్దరినీ అక్కడి నుండి తరలించారు.

అమరావతి: కరకట్ట రోడ్డు (Karakatta Road) రోజు రోజుకు ప్రమాదకరంగా (Dangerously) మారుతోంది. ఏమాత్రం ఏమర పాటుగా ఉన్నా కార్లు (Cars) 20 అడుగుల కిందకు జారిపోతున్నాయి. కాగా ఇటీవల ప్రధాని మోదీ (PM Modi) పర్యటన నేపథ్యంలో అధికారులు కరకట్ట రోడ్డుకు రెండు వైపులా బంకమట్టితో అంచులు వేయించారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి (Rains) చాలా చోట్ల ఈ మట్టి కొట్టుకుపోవడంతో పాటు బలహీనపడడంతో కరకట్ట రోడ్డు ప్రమాదకరంగా మారింది.
సిఎం నివాసం సమీపంలో కారు బోల్తా..
దీంతో శుక్రవారం సీఎం చంద్రబాబు నివాసం సమీపంలోని తపోవనం వద్ద కరకట్ట రోడ్డు నుంచి ప్రమాదవశాత్తు కారు కింద పడింది. కారు ముఖ్యమంత్రి నివాసం సమీపంలో బోల్తాపడడం, ఎవ్వరికి పెద్దగా గాయలు కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తక్షణం కారులో ఉన్న ఇద్దరినీ అక్కడి నుండి తరలించి సిఎం నివాసం వద్ద ఔట్ పోస్టుకు పంపించారు. ఈ ఏడాది కాలంలోనే ఓ అరడజను కార్లు ఇలాగే ప్రమాదానికి గురయ్యాయని వాహనదారులు అంటున్నారు. ఈరోజు ప్రమాదానికి గురైన కారు సచివాలయంలోని హెూం శాఖలో పనిచేసే వారిదిగా తెలియవచ్చింది.
Also Read: లిక్కర్ స్కామ్ నిందితులకు సుప్రీంలో చుక్కెదురు
కాగా, కృష్ణా కరకట్ట రోడ్డును నాలుగు వరసలుగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. ప్రకాశం బ్యారే జీ దిగువన కొండవీడు వాగు నుంచి రాయపూడి వరకు ఈ రహదారి విస్తరణకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్) ప్రతిపాదనకు ఆయన మొగ్గు చూపడంతో ఈ ప్రాజెక్టుపై పూర్తి స్పష్టత వచ్చింది. కృష్ణానది వరదను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో కరకట్ట రోడ్డు దుర్భేద్యంగా ఉండేలా ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించాలన్న ప్రతిపాదనకు కూడా సీఎం అంగీకారం తెలిపారు. దీనికి సంబంధించి మున్సిపల్ మంత్రి నారాయణ, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దీంతో రెండు రోజుల్లో మంత్రి, అధికారులు భేటీ కాబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు వారం రోజుల్లో టెండర్లు పిలిచేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. సీఎంతో చర్చించి అనుమతులు తీసుకున్న మేరకు కరకట్ట రహదారి పొడవు 7 కి.మీ.. సెంట్రల్ డివైడర్‌తో నాలుగు వరసల విధానంలో ఉంటుంది. ముందుగా రిటెయినింగ్ వాల్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఎర్త్‌వర్క్, వెట్‌మిక్స్, హాట్ మిక్స్ వంటి పనులు చేపట్టి బీటీ లేయర్ వేస్తారు. సెంట్రల్ మీడియం, సెంట్రల్ లైటింగ్‌తో ఫినిషింగ్ టచ్ ఇస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1,200 కోట్లు వ్యయం అవుతుందని ఏడీసీ అధికారులు అంచనా వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో కిలేడీలతో జాగ్రత్త: పోలీసులు
ఏఐజీ ఆస్పత్రికి అందాల భామలు...
For More AP News and Telugu News