Share News

Crime News: హైదరాబాద్‌లో కిలేడీలతో జాగ్రత్త: పోలీసులు

ABN , Publish Date - May 16 , 2025 | 12:18 PM

వ్యసనాలకు, లగ్జరీ జీవితానికి అలవాటుపడిన కొందరు కిలేడీలు డబ్బులు సంపాదనకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. వలపు విసిరి సాయం ముసుగులో నిలువునా దోచేస్తున్నారు. ఇలాంటి వారిపై అప్రమత్తంగా ఉండాలని, ఒంటరి మహిళ అని సానుభూతి చూపిస్తే ఇబ్బందులు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Crime News: హైదరాబాద్‌లో కిలేడీలతో జాగ్రత్త: పోలీసులు
Crime News

హైదరాబాద్‌: నగరంలో కిలేడీ (Kiledi)లతో జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా ఉన్నట్లు నటిస్తూ వాహనదారులను లిఫ్ట్ (Lift) అడిగి పర్సు, (Purse) సెల్ ఫోన్ (Cell Phone) కొట్టేస్తున్న కిలేడీలు ఉన్నారని పోలీసులు (Police) అన్నారు. ఎవరైనా అమాయకంగా దొరికితే వారిపై కిలేడీలు వేధింపుల కేసు పెడుతామని బెదిరిస్తున్నారని, మరి కొందరు కిలేడీలు చాటింగ్ పేరిట దగ్గరై చివరకు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని అన్నారు. పోలీసులను సయితం వదలకుండా సికింద్రాబాద్‌లో ఓ కానిస్టేబుల్ నుంచి కిలేడీ రూ. లక్ష కొట్టేసిందని, మరొకరిని మోసం చేయబోయి పోలీసులకు యువతి చిక్కిందని తెలిపారు. చాలామంది బయటికి తెలిస్తే పరువు పోతుందనే భయంతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం లేదని, బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే వివరాలు గుట్టుగా ఉంచుతామని పోలీసులు భరోసా ఇస్తున్నారు.


కిలేడీల టార్గెట్ ఎక్కడంటే..

హైదరాబాద్‌లోని ప్రధాన బస్‌స్టేషన్లు, రైల్వే, మెట్రోస్టేషన్ల వద్ద కిలేడీలు పాగా వేస్తారని, చేతిలో సంచితో దూర ప్రాంతం నుంచి వచ్చిన్నట్టు కనిపిస్తారని బైక్‌పై వెళ్లే వారిని లిఫ్ట్‌ అడిగి.. వారిని మాటల్లో పెట్టి వివరాలు తెలుసుకుంటారని పోలీసులు తెలిపారు. వాహనదారుల ఫ్యాంటు జేబుల్లోని పర్సులు, సెల్‌ఫోన్లు కొట్టేస్తారని, అది గమనించి ప్రశ్నిస్తే తన చేయి పట్టుకొని అల్లరి చేస్తున్నావంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తారని.. దీంతో బయటికి తెలిస్తే పరువు పోతుందనే భయంతో బాధితుడు మొత్తబడేసరికి ఆ కిలేడీ అక్కడి నుంచి మాయమవుతుందన్నారు.

Also Read: ఏఐజీ ఆస్పత్రికి అందాల భామలు...


ఇదే తరహాలో మలక్‌పేట్‌‌లో ఓ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఒక ప్రైవేటు ఉద్యోగి తన సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్నానని, బైక్‌పై వస్తుంటే జారిపడిపోయిందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా మహిళ సెల్ ఫోన్ కొట్టేసినట్టు గుర్తించామన్నారు. అలాగే గతంలోనూ సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో కొందరు మహిళలు ద్విచక్ర వాహనదారులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడ్డారన్నారు. జేబీఎస్‌వద్ద కాపు గాసి బైక్‌పై వెళుతున్న మధ్య వయసు వారిని ఆపి లిఫ్ట్ కావాలని అడిగి.. తీరా ఆమె దిగాల్సిన చోటు వద్ద దిగి నగదు, నగలివ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని అన్నారు. బోయినపల్లి వద్ద ఒకరిని ఇలాగే బెదిరించి నగదు తీసుకొని పరారయ్యారన్నారు. ఈ తరహ మోసాలు శివారు ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి కిలేడీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు మరోసారి హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చార్‌ధామ్ యాత్రకు 31 శాతం తగ్గిన భక్తులు

మహబూబ్ నగర్: పిల్లలమర్రికి అందాల భామలు..

For More AP News and Telugu News

Updated Date - May 16 , 2025 | 12:36 PM