Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ
ABN , Publish Date - May 16 , 2025 | 03:12 PM
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరికొన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. గత రెండు రోజులుగా ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ ముందు విచారణకు హాజరయ్యారు.

అమరావతి, మే 16: ఏపీలో సంచలనం సృష్టిస్తోన్న లిక్కర్ స్కాంలో (AP Liquor Scam) నేడు (శుక్రవారం) మరికొన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ కేసులో రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారు. లిక్కర్ కేసులో తవ్విన కొద్దీ వాస్తవాలు బయటపడుతున్నాయి. దీంతో మరిన్ని అరెస్ట్‌లు తప్పవనే చర్చ జరుగుతోంది. గత రెండు రోజులుగా ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి సిట్ ముందు విచారణకు హాజరవుతున్నారు.
ఈ క్రమంలో లిక్కర్ స్కాంకు సంబంధించి అధికారుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నిందితుల ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. లిక్కర్ స్కాంలో వీరి పాత్రపై విచారణ అధికారులు నిర్థారణకు వచ్చారు. మరోవైపు ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డిలకు సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇద్దరు అధికారుల అరెస్ట్‌పై జోరుగా చర్చ జరుగుతోంది.
ఈ కేసుకు సంబంధించి గత రెండు రోజులుగా సిట్ ముందు విచారణకు హాజరవుతున్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి ఈరోజు కూడా విచారణకు హాజరయ్యారు. విజయవాడ సీపీ కార్యాలయంలో ఉన్న సిట్ కార్యాలయంలో వీరి విచారణ కొనసాగుతోంది. దీంతో వీరిద్దరినీ ఈరోజు సాయంత్రం వరకు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కేసు విచారణలో వీరు సహకరించడం లేదని, తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదని సిట్ వర్గాలు చెబుతున్నాయి. సజ్జల శ్రీధర్ రెడ్డి ఇచ్చిన కన్‌సేషన్ స్టేట్‌మెంట్‌లో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప పాత్ర ఉంది అని స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, చాణిక్య, దిలీప్‌లను సిట్ బృందాలు అరెస్ట్ చేశారు. ఇక ధనుంజయ్, కృష్ణమోహన్‌లకు సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించడంతో వీరి అరెస్ట్‌కు మార్గం సుగమమైందని చెప్పుకోవచ్చు. వీరిద్దరిని అరెస్ట్ చేయడంతో పాటు వెంటనే వారిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్‌ను వేయాలని సిట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
SIT Investigation: రెండో రోజు సిట్ కస్టడీకి సజ్జల శ్రీధర్
Tirumala Donations: గోవిందుడికి భారీ కానుక
Read Latest AP News And Telugu News