SIT Investigation: రెండో రోజు సిట్ కస్టడీకి సజ్జల శ్రీధర్
ABN , Publish Date - May 16 , 2025 | 10:07 AM
SIT Investigation: మద్యం కుంభకోణం కేసులో రెండో రోజు సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి శ్రీధర్‌ను తరలించారు.
విజయవాడ, మే 16: ఏపీ లిక్కర్ స్కాం కేసులో (AP Liquor Scam) సజ్జల శ్రీధర్ రెడ్డిని (Sajjala Sridhar Reddy) రెండో రోజు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈరోజు (శుక్రవారం) ఉదయం విజయవాడ జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత సిట్ కార్యాలయానికి సజ్జలను పోలీసులు తరలించారు. సిట్ కార్యాలయంలో విచారణ ప్రారంభమైంది. తొలిరోజు నిన్న (గురువారం) సాయంత్రం ఐదు గంటలకు వరకు సజ్జలను సిట్ విచారించింది.
కాగా.. లిక్కర్ స్కాం కేసులో ఏ6గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డిని ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసుకు సంబంధించి శ్రీధర్ నుంచి మరిన్ని విషయాలు రాబట్టాల్సి ఉందని కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరింది. దీంతో మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. ఈనెల 15 నుంచి 17 వరకు మూడు రోజులు శ్రీధర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే తొలిరోజు ప్రశ్నించిన సిట్.. రెండో రోజు కూడా కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. ఏపీ మద్యం వ్యవహారంలో కీలక నిర్ణయాల సమయంలో రాజ్ కసిరెడ్డితో సజ్జల శ్రీధర్ ఉన్నట్లు సిట్ గుర్తించింది. ఇదే కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ముగ్గురిని సిట్ అధికారులు విచారించారు. ఈ కేసులో సజ్జలతో పాటు రాజ్‌కసిరెడ్డి పీఏ దిలీప్‌ను కూడా నిన్న (గురువారం) సిట్ విచారించింది. నిన్నటితో దిలీప్ విచారణ ముగిసింది. అలాగే ఈ కేసులో సజ్జల, దిలీప్ ఏసీబీ కోర్టులో బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా నిన్న(గురువారం) విచారణ జరిగింది. అయితే శ్రీధర్ రెడ్డి పిటిషన్‌పై ఈనెల 20, దిలీప్ పిటిషన్‌పై నేడు (శుక్రవారం) కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రాసిక్యూషన్‌ను కోర్టు ఆదేశించింది.
మరోవైపు ఈ కేసులో ఏ31గా ఉన్న ధనుంజయ్ రెడ్డి, ఏ32గా ఉన్న కృష్ణ మోహన్ రెడ్డిని కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. రెండు రోజుల పాటు వీరిరువురు సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మద్యం కుంభకోణానికి సంబంధించి వివిధ రూపాల్లో ఇరువురిని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
AP Revenue Comparison: సంపదపై శోకాలు
Pakistan Occupied Kashmir: పీవోకేలో ఏముందీ.. సొంతమైతే భారత్‌కు కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..
Read Latest AP News And Telugu News