Kolikapudi Srinivas: కేశినేని నాని ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు..
ABN, Publish Date - May 13 , 2025 | 01:56 PM
Kolikapudi Srinivas: కేశినేని నానిపై తెలుగుదేశం తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లు రాజకీయ పదవిని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు. రెండుసార్లు టికెట్ ఇచ్చినా కేశినేని నాని టీడీపీకి వెన్నుపోటు పొడిచారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మండిపడ్డారు.
అమరావతి: మాజీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) అక్రమాలపై సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాస్తున్నామని తెలుగుదేశం తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ (Kolikapudi Srinivas) తెలిపారు. కేశినేని నాని అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని సీబీఐ అధికారులను కోరుతామని అన్నారు. ఉద్దేశ పూర్వకంగా కేశినేని నాని బ్యాంకు రుణం ఎగ్గొట్టాడని ఆరోపించారు. గత పదేళ్లు ఎంపీ పదవిని అడ్డం పెట్టుకుని ఆర్థిక నేరానికి కేశినేని నాని పాల్పడ్డారని విమర్శలు చేశారు. ప్రజా జీవితంలో ఉన్నా నేతలు మాట్లాడే మాటలను, వ్యక్తిగత వ్యాపార విషయాలను ప్రజలు గమనిస్తారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చెప్పారు.
కేశినేని నాని కేశినేని శివనాథ్‌ను విమర్శిస్తే చూస్తు ఊరుకోమని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హెచ్చరించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మెడికల్ క్యాంపులు, జాబ్ మేళాలు, అన్నా కాంటీన్‌లు, చాలా సేవా కార్యక్రమాలను కేశినేని శివనాథ్ చేశారని గుర్తుచేశారు. ఇలాంటి మంచి వ్యక్తిపై విమర్శలు చేస్తూ లిక్కర్ స్కాంను కేశినేని నాని డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు. ఒక కంపెనీ పెట్టి రుణం తీసుకుని బ్యాంకుని కేశినేని నాని మోసం చేశారని ఆరోపించారు. మళ్లీ ఆ కంపెనీ పేరు మార్చి తన దగ్గర పని చేసే ఇద్దరినీ డైరెక్టర్లుగా కేశినేని నాని పెట్టారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆరోపణలు చేశారు.
ఆదాయాన్ని డైవర్ట్ చేసి ఆంధ్ర క్యాంటీన్ ప్రైవేట్ లిమిటెడ్ అని కూతుర్ల పేరుతో పెట్టి అక్కడ మోసం చేశారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ విమర్శించారు. ఏదొక సంస్థను అడ్డం పెట్టుకుని ఆర్థిక నేరాలకు కేశినేని నాని పాల్పడ్డారని ఆరోపించారు. గత పదేళ్లు రాజకీయ పదవిని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు. బ్యాంక్ పేరు, బ్యాంక్ వివరాలు, షెల్ కంపెనీల వివరాలు అన్ని చూపిస్తున్నాం కాబట్టి పూర్తి స్థాయి విచారణ జరపాలని సీబీఐ అధికారులను కోరారు. రెండుసార్లు టికెట్ ఇచ్చినా కేశినేని నాని టీడీపీకి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. రాజకీయాల్లో లేను అంటూనే ఒక రాజకీయ ఏజెండాతో లిక్కర్ స్కాం విషయాన్నీ పక్క దారి పట్టిస్తున్నారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆరోపించారు.
గత పదేళ్లలో ఏనాడైనా కేశినేని నాని విజయవాడ అభివృద్ధి గురించి మాట్లాడరా అని ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతాల్లో కేశినేని శివనాథ్ పర్యటిస్తున్నారని తెలిపారు. తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో యువతకు కేశినేని శివనాథ్ ప్రోత్సహం అందిస్తున్నారని అన్నారు. కేశినేని నాని ఇప్పటికైనా విమర్శలు మాని నైతిక విలువ కాపాడుకోవాలని హితవు పలికారు. ఎన్టీఆర్ జిల్లాలో 7 మంది శాసన సభ్యులు ఈ 11 నెలల్లో కేశినేని శివనాథ్ చేసిన అభివృద్ధి ఏంటో చెబుతామని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు కేశినేని నాని పదేళ్లలో ఏం చేశారని కొలికపూడి శ్రీనివాస్ ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP Police Society Scam: భారీగా నిధుల దుర్వినియోగం.. బయటపడ్డ స్కాం
Gangamma Jatara: చిత్తూరులో ప్రారంభమైన గంగమ్మ జాతర వేడుకలు
Pawan Kalyan: ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ షాకింగ్ ట్వీట్..
Sajjala Sridhar Reddy: సజ్జలను కస్టడీకి ఇవ్వండి
Nimmala Ramanaidu: నెలాఖరులోగా కాలువల మరమ్మతులు
For More AP News and Telugu News
Updated Date - May 13 , 2025 | 02:43 PM