Share News

Sajjala Sridhar Reddy: సజ్జలను కస్టడీకి ఇవ్వండి

ABN , Publish Date - May 13 , 2025 | 05:24 AM

వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్‌రెడ్డి(ఏ-6)ని ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సిట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. కోర్టు ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది.

Sajjala Sridhar Reddy: సజ్జలను కస్టడీకి ఇవ్వండి

మద్యం కుంభకోణం కేసులో ఏసీబీ కోర్టులో సిట్‌ పిటిషన్‌

బెయిల్‌ కోరిన కసిరెడ్డి పీఏ.. విచారణ 15కు వాయిదా

విజయవాడ, మే 12(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నిందితుడు సజ్జల శ్రీధర్‌రెడ్డి(ఏ-6)ని కస్టడీకి ఇవ్వాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు ఏసీబీ కోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. శ్రీధర్‌రెడ్డి నుంచి కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 15కి వాయిదా వేసింది. మరోవైపు, మద్యం కుంభకోణం కేసులో జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి(పీఏ) దిలీప్‌ ఏసీబీ కోర్టులో సోమవారం బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో దిలీప్‌ ఏ-30గా ఉన్నారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయడానికి గడువు కావాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టును అభ్యర్థించారు. దీంతో న్యాయస్థానం కేసును ఈ నెల 15కి వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి..

Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 13 , 2025 | 05:36 AM