Share News

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

ABN , Publish Date - May 12 , 2025 | 04:16 PM

Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ సైన్యం దాడులు నిర్వహించింది.

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

న్యూఢిల్లీ, మే 12: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ సైన్యం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పాకిస్థాన్‌లోని పలు ఎయిర్ బేస్‌లు పూర్తిగా ధ్వంసమైనాయి. అందుకు సంబంధించిన వీడియోలను భారత్ విడుదల చేసింది. సోమవారం న్యూఢిల్లీలో ఎయిర్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ ఎయిర్ మార్షిల్ ఏకే భార్తీ విలేకర్ల సమావేశంలో ఈ వీడియోలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమ పోరాటం ఉగ్రవాదంపైన మాత్రమేనని స్పష్టం చేశారు. అంతేకాని.. పాకిస్థాన్‌ ఆర్మీపైన కాదని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్.. ఉగ్రవాదానికి ఊతం ఇస్తుందని విమర్శించారు.

పాకిస్థాన్‌ రావల్పిండిలోని నూర్‌ఖాన్ ఎయిర్ బేస్ పూర్తిగా ధ్వంసమైన వీడియోను విడుదల చేశారు. పాక్ మిలటరీ హెడ్ క్వార్టర్ ఇస్లామాబాద్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఎయిర్ బేస్ ఉండడం గమనార్హం. అలాగే పాకిస్థాన్‌‌ పంజాబ్‌లోని రహిమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ రన్ వే సైతం ధ్వంసమైన మరో వీడియోను సైతం ప్రదర్శించారు.


మే 7వ తేదీన భారత్ ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించి.. పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం దాడి చేసింది. అందులోభాగంగా లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్‌తోపాటు హిజ్బుల్ ముజాహిద్దీన్ తదితర ఉగ్రవాద గ్రూప్‌లకు చెందిన శిబిరాలను ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు మరణించారని భారత్ ఇప్పటికే ప్రకటించింది.


భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రతి చర్యగా పాకిస్థాన్ స్పందించింది. ఆ క్రమంలో భారత్ పశ్చిమ ప్రాంతాలపైకి డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. వీటిని భారత్ తిప్పికొట్టింది. అంతేకాకుండా.. పాకిస్థాన్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్లి.. రాడార్ ఇన్‌స్టాలేషన్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లతోపాటు రఫీక్, చక్లాలా, రహీమ్ యార్ ఖాన్, సుక్కూర్‌తోపాటు సియాల్‌కోట్‌లోని ఆయుధగారాలను ధ్వంసం చేసింది.


దాదాపు భారత్, పాకిస్థాన్‌ల మధ్య దాదాపు నాలుగు రోజుల పాటు హోరా హోరీ దాడులు, ప్రతి దాడులు చోటు చేసుకున్నాయి. అనంతరం శనివారం సాయంత్రం ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఈ ఒప్పందం చేసుకున్న కొద్ది గంటలకే భారత్‌ సరిహద్దు వెంబడి కాల్పులు జరిపి.. పాకిస్థాన్ మళ్లీ తన తెంపరితనాన్ని చాటుకొంది.

ఇవి కూడా చదవండి..

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

India-Pakistan Ceasefire: భారత్, పాక్ చర్చలు సాయంత్రానికి వాయిదా

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. పాకిస్తాన్‌కు వార్నింగ్..

For National News And Telugu News

Updated Date - May 12 , 2025 | 04:40 PM