Share News

India-Pakistan Ceasefire: భారత్, పాక్ చర్చలు సాయంత్రానికి వాయిదా

ABN , Publish Date - May 12 , 2025 | 02:46 PM

డీజీఎంఓ స్థాయి చర్చల్లో కశ్మీర్ అంశం ఉండదని అధికారులు చెబుతున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశంపై చర్చ ఉంటుందంటున్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగించడం మినహా కశ్మీర్ అంశంపై ఎలాంటి చర్చలు ఉండవని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే స్పష్టం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు

India-Pakistan Ceasefire: భారత్, పాక్ చర్చలు సాయంత్రానికి వాయిదా

న్యూఢిల్లీ: భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది. కాల్పుల విరమణ అనంతర పరిస్థితిపై ఇరుదేశాల మధ్య సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ (DGMO) స్థాయిలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కీలక చర్చలు జరగాల్సి ఉండగా, అనుకోని కారణాల వల్ల సాయంత్రం 5 గంటలకు చర్యలు వాయిదా పడ్డాయి. గత శనివారంనాడు కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినప్పుడే సోమవారంనాడు హాట్‌లైన్‌లో కీలక చర్యలకు నిర్ణయించారు.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. పాకిస్తాన్‌కు వార్నింగ్..


కాగా, డీజీఎంఓ స్థాయి చర్చల్లో కశ్మీర్ అంశం ఉండదని అధికారులు చెబుతున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశంపై చర్చ ఉంటుందంటున్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగించడం మినహా కశ్మీర్ అంశంపై ఎలాంటి చర్చలు ఉండవని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే స్పష్టం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు. కశ్మీర్‌పై ఎవరి మధ్యవర్తిత్వం అక్కర్లేదని కూడా ప్రధాని తేల్చిచెప్పారు.


మరోవైపు, ప్రధాని మోదీ నివాసంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోబల్, త్రివిధ దళాధిపతులు, పలువురు ఉన్నత స్థాయి సైనికాధికారులు సోమవారం ఉదయం సమావేశమయ్యారు. అనంతరం ప్రధానితో అజిత్ దోబల్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. శాటిలైట్ ఫొటోలు విడుదల చేసిన ఆర్మీ..

Misinformation in War: కూల్చుడు పేరిట కుట్రలెన్నో

Updated Date - May 12 , 2025 | 02:51 PM