Share News

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. శాటిలైట్ ఫొటోలు విడుదల చేసిన ఆర్మీ..

ABN , Publish Date - May 12 , 2025 | 10:38 AM

Operation Sindoor: ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి కీలక సాక్ష్యాలను బయటపెట్టింది. దాడికి సంబంధించిన శాటిలైట్ ఫొటోలు విడుదల చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత ఆర్మీ రెండు భాగాలలో దాడులు చేసింది.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. శాటిలైట్ ఫొటోలు విడుదల చేసిన ఆర్మీ..
Operation Sindoor

జమ్మూకాశ్మీర్, పహల్గామ్‌లోని బైసరన్ లోయలో నలుగురు ఉగ్రవాదులు పర్యాటకులపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ముస్లింలా కాదా అని తెలుసుకుని మరీ దాడికి పాల్పడ్డారు. 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. భర్తను కోల్పోయిన ఓ భార్య తనను కూడా చంపేయమని ఉగ్రవాదుల్ని అడిగింది. ‘ మేము నిన్ను చంపము.. పోయి మీ మోదీకి చెప్పు’ అని అన్నారు. ఈ సంఘటనపై మోదీ గట్టిగానే స్పందించారు. ఉగ్రవాదులకు, వారి వెనకాల ఉండి నడిపిస్తున్న వారికి బుద్ధి చెప్పాలని భావించారు.

1].jpg


ఆపరేషన్ సిందూర్‌కు శ్రీకారం చుట్టారు. ఆర్మీ పాకిస్తాన్‌లోని టెర్రరిస్టుల క్యాంపులపై దాడులు చేసింది. భారీ విధ్వంసం సృష్టించింది. భారత ఆర్మీ దాడిలో దాదాపు 100 మందికిపైగా ఉగ్రవాదులు చనిపోయారు. ఈ దాడిని తట్టుకోలేకపోయిన పాక్ ప్రతి దాడికి దిగింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది. అమెరికా మధ్య వర్తిత్వంతో.. కాల్పుల విరమణ ఒప్పందం మేరకు యుద్ధం ఆగిపోయింది. తాజాగా, ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించి కీలక సాక్ష్యాలను బయటపెట్టింది.

2.jpg


దాడికి సంబంధించిన శాటిలైట్ ఫొటోలు విడుదల చేసింది. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత ఆర్మీ రెండు భాగాలలో దాడులు చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్‌లోని ఐదు ఉగ్ర స్థావరాలను.. పాకిస్తాన్‌లోని నాలుగు ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసింది. పాయింట్ల ప్రకారం టార్గెట్‌‌లను ఫిక్స్ చేసి దాడులకు పాల్పడింది. భారత ఆర్మీ విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలలో దాడికి ముందు, దాడికి తర్వాతి దృశ్యాలు ఉన్నాయి.

3.jpg


ఇవి కూడా చదవండి

Hero Vishal: విశాల్‌కు అస్వస్థత.. స్టేజిపై స్ప్రహతప్పిన హీరో

Viral Video: శుభమా అని పెళ్లి చేసుకోబోతూ ఇదేం పని..

Updated Date - May 12 , 2025 | 11:00 AM