Home » Kolikapudi Srinivasa Rao
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ల మధ్య నెలకొన్న వివాదంపై తెలుగుదేశం పార్టీ హై కమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఇద్దరు నేతలని పిలిపించి మాట్లాడింది.
టీడీపీ నేతలకి సంబంధించిన తిరువూరు విభేదాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ లైన్ ఎవరు దాటినా సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
జగన్ తన ఐదేళ్ల పాలనలో ఏపీలోని సాగునీటి ప్రాజెక్టులను విధ్వంసం చేశారని టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. రివర్స్ టెండరింగ్ పేరుతో మొత్తం పోలవరం ప్రాజెక్టుని వరదల్లో ముంచేశారని కొలికపూడి శ్రీనివాసరావు విమర్శించారు.
ఇప్పుడే పుట్టిన అమరావతి పసికూనను జగన్ నాశనం చేయాలనుకుంటే అమరావతి రైతులు ఉద్యమం చేపట్టి జగన్‌ను పాతాళ లోకానికి తొక్కేస్తారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 2019లో వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ రాయపూడిలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది నిజం కాదా అని కొలికపూడి ప్రశ్నించారు.
తాను రాజకీయాల్లోకి రావడం ఆ దేవుని దయ అని.. హీరోగా ఎదగటానికి కూడా దైవ సంకల్పమే కారణమని ప్రముఖ సినీ హీరో సుమన్ ఉద్ఘాటించారు. రాజకీయల్లోకి రావటానికి ఇంకా నాలుగేళ్ల సమయం ఉందని.. దైవ సంకల్పం ఉంటే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని సుమన్ పేర్కొన్నారు.
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలవడంపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. ఇలా తనపై ప్రచారం చేస్తున్నవారిపై ఆయన మండిపడ్డారు.
తిరువూరు ఎస్ఐ సత్యనారాయణ ఒక బ్యాచ్‌నీ పెట్టుకొని గంజాయి అమ్మే, కొనే వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపణలు చేశారు. తిరువూరు స్టేషన్‌లో ఎస్ఐ ప్రైవేట్ పంచాయతీలు చేస్తూ అక్రమ వసూళ్లు చేస్తున్నాడని పూర్తి ఆధారాలు తాను చూపిస్తానని ఎమ్మెల్యే కొలికపూడి చెప్పారు.
Kolikapudi Srinivas: కేశినేని నానిపై తెలుగుదేశం తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లు రాజకీయ పదవిని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు. రెండుసార్లు టికెట్ ఇచ్చినా కేశినేని నాని టీడీపీకి వెన్నుపోటు పొడిచారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మండిపడ్డారు.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోకపోవడం వివాదం రేపింది. ఆయన ఎన్నోసారి ప్రయత్నించినప్పటికీ, చంద్రబాబు అతన్ని విస్మరించి ముందుకు సాగారు. కొలికపూడి రోడ్డుపై ఇబ్బందులు ఎదుర్కొన్నారు
Tiruvuru Politics: తిరువూరులో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను పోటాపోటీగా నిర్వహించేందుకు పూనుకున్నారు కూటమి శ్రేణులు. ఎమ్మెల్యే, ఆర్గానిక్ ప్రొడక్షన్ చైర్మన్ ఇరువురి ఆధ్వర్యంలో జయంతి వేడుకలకు పిలుపునిచ్చారు.