TDP High command: తిరువూరు వివాదాలపై టీడీపీ హై కమాండ్ దృష్టి.. నేతలకి కీలక ఆదేశాలు
ABN , Publish Date - Nov 04 , 2025 | 04:22 PM
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ల మధ్య నెలకొన్న వివాదంపై తెలుగుదేశం పార్టీ హై కమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఇద్దరు నేతలని పిలిపించి మాట్లాడింది.
అమరావతి, నవంబరు4 (ఆంధ్రజ్యోతి): తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Thiruvur MLA Kolikapudi Srinivasa Rao), విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) (Vijayawada MP Kesineni Sivanath)ల మధ్య నెలకొన్న వివాదంపై తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) హై కమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఇద్దరు నేతలని పిలిపించి మాట్లాడింది. ఈ సందర్భంగా ఇద్దరు నేతలకి టీడీపీ హై కమాండ్ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇద్దరి నేతల మధ్య అసలు వివాదం ఎందుకు వచ్చిందని ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన వాదనని క్రమశిక్షణ కమిటీకి చెప్పుకున్నారు. దాదాపు నాలుగు గంటలసేపు క్రమశిక్షణ కమిటీ ముందు వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే కొలికిపూడి. తిరువూరులో చోటు చేసుకున్న పరిణామాలపై క్రమశిక్షణ కమిటీ ముందు ఒక నివేదిక రూపంలో కొలికిపూడి వివరణ ఇచ్చారు. అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి కొలికిపూడి శ్రీనివాసరావు వెళ్లిపోయారు.
పార్టీకి కట్టుబడి ఉంటాను: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
ఎంపీ కేశినేని చిన్నిపై తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలని టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు ఉంచానని తిరుపూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. క్రమశిక్షణ కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు పలు సమాధానాలు స్పష్టంగా ఇచ్చానని పేర్కొన్నారు. ఎంపీ కేశినేని చిన్నిపై తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన అనేక విషయాలకు వివరణ ఇచ్చానని తెలిపారు. తిరువూరు నియోజకవర్గంలో విభేదాలకు కారణమైన అనేక విషయాలను క్రమశిక్షణ కమిటీకి వెల్లడించానని అన్నారు. తిరువూరు వివాదంపై పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు కేశినేని శివనాథ్ వివరణ..
అలాగే, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో కూడా టీడీపీ క్రమశిక్షణ కమిటీ మాట్లాడింది. ఈ క్రమంలోనే కేశినేని శివనాథ్ కూడా తన వాదనని క్రమశిక్షణ కమిటీకి చెప్పుకున్నారు. ఏ సమస్య ఉన్నా హైకమాండ్‌కి తెలియజేయాలని కేశినేని శివనాథ్‌ని ఆదేశించింది టీడీపీ క్రమశిక్షణ కమిటీ.
టీడీపీనే నాకు దైవం: ఎంపీ కేశినేని చిన్ని
టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు 20 నిమిషాల పాటు మాత్రమే ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారు. ఈ నేపథ్యంలో కేశినేని చిన్ని తన వివరణ ఇచ్చారు. తాను సీఎం చంద్రబాబుకి వీరభక్తుడినని ఉద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీయే తనకు దైవమని అభివర్ణించారు. చంద్రబాబు తమకు సుప్రీం అని స్పష్టం చేశారు. తిరువూరు నియోజకవర్గ కార్యకర్తల అభీష్టం మేరకే పార్టీ నిర్ణయం ఉంటుందని అనుకుంటున్నానని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.
టీడీపీ హైకమాండ్ ముందుకి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
మరోవైపు.. నెల్లూరు జిల్లా కావలి రాజకీయాలపై టీడీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి (Kavya Krishna Reddy)కి టీడీపీ హై కమాండ్ నుంచి పిలుపువచ్చింది. ఎమ్మెల్యేపై స్థానిక టీడీపీ నేతల ఫిర్యాదుల మేరకు అధిష్టానం పిలిచినట్లు తెలుస్తోంది. ఇటీవల కావలిలో జరిగిన పరిణామాలపై టీడీపీ హై కమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కావలి ఎమ్మెల్యే భేటీ అయ్యారు. కావలి టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాలను అడిగి పల్లా శ్రీనివాసరావు తెలుసుకున్నారు. ఇటీవల మరణించిన సుబ్బనాయుడుతో తనకు విభేదాల్లేవని పల్లా శ్రీనివాసరావుకు స్పష్టం చేశారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.
ఈ వార్తలు కూడా చదవండి...
ఉల్లి రైతుల సమస్యలని ఏపీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: ఎంపీ అవినాశ్ రెడ్డి
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్
Read Latest AP News And Telugu News