ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Narayana: టీడీఆర్ బాండ్లలో జ‌రిగిన అక్ర‌మాల‌పై విచార‌ణ చేస్తున్నాం

ABN, Publish Date - May 25 , 2025 | 07:27 PM

Minister Narayana: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై కూడా రుణాలు తెచ్చుకుందని అన్నారు. అమృత్ పథకానికి కేంద్రం ప్రభుత్వం నిధులిచ్చినా ఏపీ వాటా విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో నిధులు విడుద‌ల కాలేదని చెప్పారు.

Minister Narayana

కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీఆర్ బాండ్లలో జ‌రిగిన అక్ర‌మాల‌పై విచార‌ణ జ‌రుగుతుందని మంత్రి నారాయ‌ణ‌ (Minister Narayana) తెలిపారు. గత జగన్ ప్రభుత్వం టిడ్కో ఇళ్లలో మౌళిక‌ వ‌స‌తులు క‌ల్పించ‌కుండా నిర్ల‌క్ష్యంగా వ‌దిలేసిందని ఆరోపించారు. విజయదశమి నాటికి టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పారు. ఇవాళ(ఆదివారం) ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలోని మున్సిపాల్టీల అధికారుల‌తో మంత్రి నారాయ‌ణ స‌మీక్ష‌ సమావేశం నిర్వహించారు. ఈ స‌మీక్ష‌కు ఆన్‌లైన్‌లో మున్సిప‌ల్ శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి సురేష్ కుమార్, డైరెక్ట‌ర్ సంప‌త్ కుమార్, ఇత‌ర ఉన్న‌తాధికారులు హాజ‌రయ్యారు.


ఆయా మున్సిపాల్టీల్లో చేప‌ట్టిన అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, టౌన్ ప్లానింగ్ అంశాలు, డ్రెయిన్ల పూడిక‌తీత‌పై మంత్రి నారాయ‌ణ‌ దిశానిర్ధేశం చేశారు. క‌డ‌ప అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ప‌రిధిలో చేప‌ట్టాల్సిన అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై చ‌ర్చించారు. ఈ స‌మీక్ష త‌ర్వాత మీడియాతో మంత్రి నారాయ‌ణ‌ మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై కూడా రుణాలు తెచ్చుకుందని అన్నారు. అమృత్ పథకానికి కేంద్రం ప్రభుత్వం నిధులిచ్చినా ఏపీ వాటా విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో నిధులు విడుద‌ల కాలేదని చెప్పారు. ఏపీలో 80 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని చెప్పుకొచ్చారు మంత్రి నారాయ‌ణ‌.


గత జగన్ ప్రభుత్వం విధానాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మంత్రి నారాయ‌ణ‌ తెలిపారు. వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాల ద్వారా చెత్తను పూర్తిగా డ్రై చేసే విధానాన్ని అమలు చేయబోతున్నామని ప్రకటించారు. త్వరలో కడప, కాకినాడ, నెల్లూరు, కర్నూలు, విజయవాడలో వేస్ట్ టు ఎన‌ర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నామని స్పష్టం చేశారు. ఏపీలో డంపింగ్ యార్డ్ లేకుండా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. గత జగన్ ప్రభుత్వం విచ్చలవిడిగా సీఎఫ్ఎంఎస్ నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. 123 మున్సిపాలిటీలకు సీఎఫ్ఎంఎస్ నుంచి గ్రీన్ ఛానల్ ఇస్తున్నామని ప్రకటించారు. ప్రజల అవసరాల దృష్ట్యా సీఎఫ్ఎంఎస్ నుంచి నిధులను నేరుగా మున్సిపాలిటీలు వాడుకోవచ్చని మంత్రి నారాయణ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సీఎం చంద్రబాబు కుటుంబం నూతన గృహప్రవేశం

పండుగలా సీఎం చంద్రబాబు గృహప్రవేశం

For More AP News and Telugu News

Updated Date - May 25 , 2025 | 07:32 PM