PM Modi: ప్రధాని మోదీ పర్యాటనకు ఏపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు
ABN, Publish Date - May 01 , 2025 | 01:21 PM
PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ రాజధాని అమరావతిలో శుక్రవారం నాడు పర్యటించనున్నారు. మోదీ పర్యటన దృష్ట్యా ఏపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ప్రధాని పర్యటనలో ఎలాంటి లోటు పాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
అమరావతి: అమరావతి పున: ప్రారంభ పనులకు రేపు(మే 2) ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ సభకు దాదాపు 5 లక్షల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. రాజధానికి తరలివచ్చే ప్రజల కోసం రవాణా వసతి కల్పిస్తుంది. ఇందుకోసం 8 వేల బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజధాని చుట్టుపక్కల ఉన్న 8 జిల్లాల నుంచి భారీగా జనం వచ్చే అవకాశం ఉంది. ఈ 8 జిల్లాలకు మొత్తం 6,600 బస్సులు కేటాయించింది. మిగిలిన జిల్లాల్లోని 120 నియోజకవర్గాలకు 1400 బస్సులు ఏర్పాటు చేసింది. ఇవాళ(గురువారం) రాత్రికి సంబంధిత గ్రామాలకు బస్సులు చేరుకోనున్నాయి.
ఒక్కో బస్సుకు ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఇన్‌చార్జిగా ప్రభుత్వం నియమించింది. సభకు జనాలను తీసుకెళ్లి తిరిగి ఇంటికి చేర్చే బాధ్యత ఇన్‌ఛార్జులకు అప్పగించింది. ఏర్పాట్ల పర్యవేక్షణకు మండలానికి ఒక ఇన్‌ఛార్జికి బాధ్యతలు అప్పగించింది. బస్సులు రేపు(శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటలకు సభకు చేరుకునేలా ప్రణాళిక చేశారు. రాజధానికి వెళ్లే ప్రజలకు అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. వేసవి దృష్ట్యా సభకు వచ్చే ప్రజలకు మజ్జిగ, ఓఆర్ఎస్, పండ్లు పంపిణీ చేయనుంది. జిల్లాల పౌరసరఫరాల శాఖాధికారులకు ఆహారం సరఫరా బాధ్యత అప్పగించింది. సభకు వచ్చే మార్గాల్లో ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసింది. సభా గ్యాలరీల్లోనూ ఆరుగురు సిబ్బందితో కూడిన వైద్య బృందాన్ని ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది.
ప్రధాని పర్యాటన కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి: మంత్రి నారాయణ
ఇవాళ(గురువారం) ఉదయం అధికారులతో సమీక్ష సమావేశం జరిగిందని మంత్రి నారాయణ తెలిపారు. రేపు(శుక్రవారం) మధాహ్నం 3:20లకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వస్తారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యాటన కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయని తెలిపారు. 29 గ్రామాల ప్రజలు, రైతులను స్వయంగా సీఎం చంద్రబాబు ఆహ్వానించారని అన్నారు. రైతుల త్యాగం మరువలేనిదని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
అందుబాటులో ప్రత్యేక మెడికల్ టీం: మంత్రి పయ్యావుల కేశవ్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించే సభా ప్రాంగణం సిద్ధం అయిందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పార్కింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. బస్ దిగిన తర్వాత ప్రజలు పెద్దగా నడవడానికి ఇబ్బంది లేకుండా వేదిక నిర్మాణం జరిగిందని తెలిపారు. ప్రత్యేక మెడికల్ టీం కూడా అందుబాటులో ఉందని చెప్పారు. రాజధాని అమరావతి పనుల ప్రారంభోత్సవం కోసం ఇవాళ రాష్ట్రం మొత్తం ఉత్సాహంగా చూస్తోందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
మూడు రాజధానుల పేరుతో జగన్ హింస: మంత్రి కొల్లు రవీంద్ర
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో పెట్టిన హింస అందరూ చూశామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంత్రులు, అధికారులు అందరూ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.
ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు: మంత్రి నాదెండ్ల మనోహర్
రాజధాని కార్యక్రమం మనదనే భావన ప్రజల్లో అందరికి వచ్చిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రధాని సభకు ఏర్పాట్లు అన్ని బాగా జరిగాయని అన్నారు. జిల్లాల నుంచి వచ్చే వారికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
సభ భద్రత చాలా ముఖ్యం: నోడల్ ఆఫీసర్ వీర పాండ్యాన్
ప్రధాని మోదీ బహిరంగ సభకు సంబంధించి మంత్రులు అధికారులు సమావేశం నిర్వహించారని నోడల్ ఆఫీసర్ వీర పాండ్యాన్ తెలిపారు. ఈ మేరకు అధికారులు, భద్రతా సిబ్బందికి సూచనలు చేశారు. బహిరంగ సభకు వచ్చే వారికి భద్రత చాలా ముఖ్యమని అన్నారు. వర్షం వస్తే ఏం చేయాలనే అంశంపై దృష్టి పెట్టామని చెప్పారు. తిరుపతి తొక్కిసలాట సంఘటన దృష్టిలో పెట్టుకోని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఎలాంటి తొక్కిసలాట లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, భద్రతా సిబ్బందికి నోడల్ ఆఫీసర్ వీర పాండ్యాన్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
YS Jagan: అమరావతి రీ లాంచ్ పనులు.. వైఎస్ జగన్‌కు ఆహ్వానం
Home Minister Anitha: పవన్ మాటలు చాలా ప్రోత్సాహాన్నిచ్చాయి
CM Chandrababu: నెల్లూరు జిల్లా పర్యటనకు..
పహల్గాం దాడిని ఖండించిన ఐక్యరాజ్య సమితి
ప్రభుత్వ వెంచర్లో కొంటే రిజిస్ట్రేషన్ ఖర్చు తక్కువ
For More AP News and Telugu News
Updated Date - May 01 , 2025 | 01:37 PM